వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డాన్' అలజడి: షరీఫ్‌కు 5 రోజుల గడువిచ్చిన పాక్ సైన్యం

|
Google Oneindia TeluguNews

కరాచీ: పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలున్నట్లుగా డాన్ పత్రికలో వచ్చిన కథనం అలజడి సృష్టిస్తోంది. శుక్రవారం నాడు (14వ తేదీ) కార్ప్స్ కమాండర్ల సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి హెచ్చరిక సంకేతాలు పంపించింది.

ఈ నెల 3న జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన రహస్య వివరాలను డాన్ ప్రతినిధి సిరిల్ అల్మీదాకు పీఎంఓలో ఉన్నవారే ఇచ్చి ఉంటారని, ఆ వ్యక్తి ఎవరో ఐదు రోజుల్లో బయట పెట్టాలని స్పష్టం చేసింది. అదే సమయంలో డాన్ కథనం కల్పితమని, తప్పు అని చెప్పింది.

ఈ కథనం దేశ భద్రతకు ప్రమాదకరమని పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది. అయితే, తప్పుడు సమాచారం వల్ల ఏ విధంగా హాని జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ పీఎంఓ సిరిల్ అల్మీదాను ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌లో పెట్టింది. దీనిపై అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయంపై తగ్గింది.

Military boys set timer device on Nawaz Sharif government

కాగా, సిరిలి అల్మిదా సంచలన కథనం డాన్‌లో ఇచ్చిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీకి మధ్య విభేదాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. వాటిని పత్రిక సంపాదకులు కూడా సమర్థించారు. తాము మళ్ళీ మళ్ళీ సరిచూసుకొని ఈ కథనాన్ని ప్రచురించామన్నారు.

అయితే ఈ కథనం నవాజ్ షరీఫ్‌కు ఆయన సోదరుడు, పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్‌కు అనుకూలంగా, సైన్యానికి వ్యతిరేకంగా ఉందని ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ మండిపడుతున్నారు. అన్నదమ్ములిద్దరూ ఉగ్రవాదులను కటకటాల్లోకి నెట్టే యోధులుగా ఈ కథనంలో చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
The Pakistan army elite has sounded the warning bell for the beleaguered Nawaz Sharif government. At the Corps Commanders meeting on 14th October, the animosity towards the Prime Minister and his team was evident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X