మినీ ఇండియా: కువైట్‌లో మోడీ, అరబిక్‌లోకి రామాయణం, మహా భారతం
రెండు రోజుల పర్యటన నిమిత్తం కువైట్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా అక్కడి ప్రవాస భారతీయులు ఎంతో అప్యాయంగా ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులతో నిర్వహించిన 'హలా మోడీ' కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియా దేశమైన కువైట్‌లో ఇంత మంది భారతీయులను చూడటం ఆనందంగా ఉందన్నారు.
తనకు ఇక్కడ మినీ ఇండియా కనిపిస్తోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. మీ అందరికీ భారత్ నుంచి ఇక్కడికి రావడానికి 4 గంటల సమయం పడితే.. ఓ భారత ప్రధాని ఇక్కడికి రావడానికి 4 దశాబ్దాల సమయం పట్టిందన్నారు. కాగా, గత 43 ఏళ్లలో కువైట్‌లో పర్యటించిన తొలి ప్రధాని నరేంద్ర మోడీనే కావడం గమనార్హం.

ప్రతి సంవత్సరం వందలాది మంది భారతీయులు ఇక్కడికి వస్తున్నారని, అలా కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేశారని మోడీ అన్నారు. భారతదేశ ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాలను మేళవించి కువైట్ నేలను భారతీయ నైపుణ్య రంగులతో నింపారని ఈ సందర్భంగా ప్రవాస భారతీయులపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోడీ. ఈ దేశ వైద్య రంగానికి భారతీయ వైద్యులు, పారామెడికోలే ప్రధాన బలమని పేర్కొన్నారు.
The warmth and affection of the Indian diaspora in Kuwait is extraordinary. Addressing a community programme. https://t.co/XzQDP6seLL
— Narendra Modi (@narendramodi) December 21, 2024
కువైట్ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందని ప్రధాని మోడీ చెప్పారు. ఈ దేశ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించి ప్రశంసిస్తూనే ఉంటారన్నారు. రెమిటెన్స్‌లను స్వీకరించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు. మీరంతా కష్టపడి పనిచేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. భారత్, కువైట్ దేశాలు అరేబియా సముద్రానికి ఇరువైపులా ఉన్నాయని తెలిపారు.
Delighted to have met Shri @MangalSainHanda Ji in Kuwait this afternoon. I admire his contribution to India and his passion for India's development. pic.twitter.com/mxFtynFatC
— Narendra Modi (@narendramodi) December 21, 2024
భారత్, కువైట్ దేశాలను కేవలం దౌత్యసంబంధాలే కాదు.. హృదయ సంబంధాలు కూడా దగ్గర చేస్తున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. కువైట్ కు అవసరమైన మానవ వనరులు, నైపుణ్యత, సాంకేతికతను అందించడంలో భారత్ ముందంజలో ఉందని తెలిపారు. రాబోయే కాలంలో ఈ రెండు దేశాలు కేవలం వాణిజ్యపరంగానే కాకుండా పరస్పర శ్రేయస్సు కోరుకునే భాగస్వాములు కూడా అవుతాయన్నారు. భారత్‌లోని స్టార్టప్‌లు, సాంకేతిక కువైట్ అవసరాలకు అత్యాధునిక పరిష్కారాలను చూపించగలవని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Thank you Kuwait. I’m delighted by the wonderful welcome. pic.twitter.com/sz2FF40vrM
— Narendra Modi (@narendramodi) December 21, 2024
కువైట్ దాదాపు 9 లక్షల మంది భారతీయులకు ఆతిథ్యం ఇస్తోందని, ఇది ఇక్కడి శ్రామిక శక్తిలో 30 శాతం అని చెప్పారు. మొత్తంగా కువైట్ జనాభాలో భారతీయులు 21 శాతం ఉన్నారు. భారతీయులు అందిస్తున్న సేవలను ఇక్కడి నేతలు తరచూ ప్రశంసిస్తూనే ఉంటారని చెప్పారు. కాగా, కరోనా సమయంలో భారత్ కు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసిన కువైట్ ప్రభుత్వానికి ప్రధాని మోడీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
يسعدني أن أرى ترجمات عربية ل"رامايان" و"ماهابهارات". وأشيد بجهود عبد الله البارون وعبد اللطيف النصف في ترجمات ونشرها. وتسلط مبادرتهما الضوء على شعبية الثقافة الهندية على مستوى العالم. pic.twitter.com/XQd7hMBj3u
— Narendra Modi (@narendramodi) December 21, 2024
మరోవైపు, రామాయణం, మహా భారతం లను అరబిక్ భాషలోకి అనువదించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. 'రామాయణం", "మహాభారతం" అరబిక్ అనువాదాలను చూసి నేను సంతోషిస్తున్నాను. వాటిని అనువదించి ప్రచురించడంలో అబ్దుల్లా అల్-బారన్, అబ్దుల్ లతీఫ్ అల్-నిస్ఫ్ చేసిన కృషిని నేను ప్రశంసిస్తున్నాను. వారి చొరవ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ఉన్న ప్రజాదరణను హైలైట్ చేస్తుంది' అని ప్రధాని మోడీ అన్నారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications