17 ఏళ్ల కుమార్తె: ఎయిర్ హోస్టెస్ ప్రేమలో కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పడం కష్టం. ప్రేమ పుట్టడానికి హోదాలు కూడా అడ్డురావు. అసలు ప్రేమ ఎప్పుడు ఎలా అంతేకాదు పేద-ధనిక అనే తేడా కూడా ఉండదు. హోదాలు కూడా అడ్డురావు. ఇందుకు నిదర్శనమే ఓ కేంద్రమంత్రి ప్రేమ వ్వవహారమే నిదర్శనం.
వివరాల్లోకి వెళితే బాలీవుడ్‌లో నేపథ్య గాయకుడిగా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని గడచిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ తెరగేట్రం చేసి ఎంపీగా విజయం సాధించిన బాబుల్ సుప్రియో గుర్తున్నారుగా. సినిమా రంగం నుంచి వచ్చిన బూబుల్‌కు ప్రధాని మోడీ తన మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖను అప్పగించారు.

పాలనలో కూడా సత్తా చాటుతున్న బాబుల్ సుప్రియో ఆగస్టు 9వ తేదీన పెళ్లి పీటలు ఎక్కనున్నారు. జెట్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న రచనా శర్మను 46 ఏళ్ల బాబుల్ సుప్రియో రచనను తొలి చూపులోనే ప్రేమించారట. ఇంతకీ తొలిచూపు ప్రేమ ఎక్కడ... ఎలా అని అడిగితే ఆయన ఇలా చెప్పుకొచ్చారు.
ఇద్దరూ తొలిసారి 35 వేల అడుగుల ఎత్తులో జెట్ ఎయిర్‌వేస్‌లో కలిశారు. కొల్‌కతా నుంచి ముంబై వెళ్లే విమానంలో యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి ప్రయాణిస్తుండగా సుప్రియోను రచన పలకరించింది. 2014 ఎన్నికల్లో తన లోక్‌సభ అభ్యర్థిత్వంపై రాందేవ్ బాబాతో చర్చిస్తుండగా రచనా శర్మ జోక్యం చేసుకున్నారని సుప్రియో తెలిపారు.
టికెట్ లభిస్తే మీ విజయం ఖాయమంటూ ఆయన భుజం తట్టిందట. ఆ తర్వాత ఆమెపై ఆసక్తి చూపిన బాబుల్, శర్మ ఫోన్ నెంబరు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ఇద్దరూ తరచూ ఫోన్లు చేసుకోవడం మొదలైంది. ఈ క్రమంలో తన మనసును ఆమెకు అర్పించుకున్నానని సుప్రియో చెప్పారు.

ఆ తర్వాత రచన శర్మ చెప్పినట్లే బాబుల్ కు టికెట్ రావడం, ఎంపీగా విజయం సాధించడం, కేంద్ర మంత్రిగా పదవి దక్కడం జరిగిపోయాయి. ఈ క్రమంలో వీరి మధ్య అనుబంధం మరింత బలపడింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట ఇటీవలే పెద్దల సమక్షంలో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు.
కాగా రచనా శర్మకు ఈ వివాహం తొలిది కాగా, బాబుల్ సుప్రియోకు మాత్రం ఈ పెళ్లి రెండోది. బాలీవుడ్‌లో 17 సినిమాలకు నేపధ్య గాయకుడిగా పనిచేసిన బాబూల్ సుప్రియోకు ఆ సమయంలో అతడికి రియా పరిచయమైంది. 1995లో షారుక్ ఖాన్‌తో కలిసి టొరొంటోలో కచేరి ఇస్తున్న సమయంలో ఆమెతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 1999లో వారికి షర్మిలి అనే కుమార్తె జన్మించింది. బాబుల్ కుమార్తెకు ఇప్పుడు 17 ఏళ్లు. కాగా... ఏవో మనస్పర్థల కారణంగా రియా, బాబులు ఇద్దరూ 2015లో విడాకులు తీసుకున్నారు. బాబుల్ ప్రస్తుతం ప్రేమలో పడిన ఎయిర్ హోస్టెస్ రచనను 2016 ఆగస్టు నెలలో పెళ్లాడబోతున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications