అయ్యో.. ఒక్క ట్వీట్ ఎంత పనిచేసింది.. కిరీటం వచ్చినట్టే వచ్చి..

మిస్ టర్కీ- 2017గా శుక్రవారం నేషనల్ బ్యూటీ అవార్డు అందుకున్న అందాల భామ ఇతిర్ ఇసెన్ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఆమె చేసిన ఓ ట్వీట్... బ్యూటీ పేజెంట్ నిర్వాహకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అవార్డు ఇచ్చి

ఇస్తాంబుల్: మిస్ టర్కీ- 2017గా శుక్రవారం నేషనల్ బ్యూటీ అవార్డు అందుకున్న అందాల భామ ఇతిర్ ఇసెన్ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. గతేడాది టర్కీలో జరిగిన తిరుగుబాటుకు సంబంధించి ఆమె చేసిన ఓ ట్వీట్... బ్యూటీ పేజెంట్ నిర్వాహకులకు ఆగ్రహం తెప్పించింది.

దీంతో అవార్డు ఇచ్చిన గంటల్లోనే ఆమెను నుంచి కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు. గతేడాది జూలై 15న టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయిప్ ఎర్డోగాన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా తిరుగుబాటు జరిగింది. దీన్ని అడ్డుకునే క్రమంలో మొత్తం 249 మంది అమరులయ్యారు.

Miss Turkey 2017 loses crown over contentious coup tweet

తిరుగుబాటు జరిగి ఏడాది కావస్తున్న సందర్భంగా 18 ఏళ్ల ఇతిర్ ఇసెన్ ట్విటర్లో స్పందిస్తూ... అమరులు చిందించిన రక్తాన్ని తన రుతుక్రమం బ్లీడింగ్‌తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

అయితే అందాల పోటీలు ముగిశాక ఈ ట్వీట్ విషయం కాస్తా బ్యూటీ పేజెంట్ నిర్వాహకులకు తెలిసింది. ఆమె వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకమైన రీతిలో ఉన్నాయని నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకున్నారు.

వాస్తవానికి గురువారమే మిస్ టర్కీ 2017 అవార్డు గెలుచుకున్న ఇతిర్... త్వరలో చైనాలో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. తాజా పరిణామాలతో ఆమె ప్రపంచ సుందరి పోటీల్లో కూడా కనిపించే చాన్స్ పోగొట్టుకున్నట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+