ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ.. కుప్పకూలిన రష్యన్ మోడల్! కోమాలోకి వెళ్లిపోయి...

ఓ పధ్నాలుగేళ్ల రష్యన్ మోడల్ కలలు కల్లలయ్యాయి. కలల జీవితాన్ని అందుకునేందుకు రష్యా నుంచి చైనాకి వచ్చిన ఈ మోడల్ ఆశల జీవితం వాకిట క్యాట్‌ వాక్‌ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

షాంఘై : ఓ పధ్నాలుగేళ్ల రష్యన్ మోడల్ కలలు కల్లలయ్యాయి. కలల జీవితాన్ని అందుకునేందుకు రష్యా నుంచి చైనాకి వచ్చిన ఈ మోడల్ ఆశల జీవితం వాకిట క్యాట్‌ వాక్‌ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

రష్యాకు చెందిన వాల్డా జ్యూబా ఓ ఏజెన్సీతో 'స్లేవ్‌ లేబర్‌'గా మూడు నెలల ఒప్పందం కుదుర్చుకుని మోడలింగ్‌ కోసం చైనాకు వచ్చింది. పాపం.. ఈ ఒప్పందంలో మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ లేదు.

Model, 14, who collapsed beside catwalk and died was on 'slave labour' contract with no medical insurance

చనిపోయే ముందు వాల్డా.. షాంఘైలో ఆసియా ఫ్యాషన్‌ షోలో పాల్గొంది. 13 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన షో కారణంగా ఆమె తీవ్ర ఉద్వేగానికి గురైంది. ఆ ఒత్తిడిలోనే ర్యాప్ పై నడుస్తూ కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయింది.

దీంతో కార్యక్రమ నిర్వహకులు వాల్డాను ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరకు ప్రాణాలు విడిచింది. ఇది మోడల్ వాల్డా ఒక్కదాని సమస్యే కాదు.

రష్యా నుంచి చైనాకు మోడలింగ్‌ చేసేందుకు వస్తున్న ఎందరో రష్యన్‌ యువతుల జీవితానికి సంబంధించిన సమస్య. ఆశల జీవితాన్ని అందుకునేందుకు దేశం దాటి వస్తున్న మోడల్స్‌ ప్రాణాలతో చైనా ఏజెన్సీలు చెలగాటమాడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+