గాంధీ కూడా ఎన్నారై, రండి: మోడీ పిలుపు (పిక్చర్స్)

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారతీయులు ప్రపంచ యవనికపై భారత్‌ అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షిస్తున్నారని, వారి ఆకాంక్షను మీరు నెరవేరుస్తారన్న విశ్వాసం తనకు ఉందని, మీరు ‘మేక్‌ ఇన్‌ ఇండియా' ప్రాజెక్టులో భాగస్వాములుకావడం ద్వారా దాన్ని నెరవేర్చండని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. మీ వద్ద ఉన్న ఫోన్‌, లాప్‌టాప్‌ నుంచి లాగిన్‌ అవ్వడం ద్వారా మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగస్వాములు కావచ్చునిని సూచించారు.

మహాత్మాగాంధీ కూడా ప్రవాసభారతీయుడేనని, గాంధీ 1915 జనవరిలో భారతదేశానికి తిరిగివచ్చాడని, దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాడని, ఆ అద్భుతఘట్టానికి వచ్చే ఏడాదితో వందేళ్లు నిండుతాయని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అహ్మదాబాద్‌లో ‘ప్రవాసీ భారతీయ దివస్‌'ను నిర్వహిస్తున్నామని, దానికి మీరంతా రావాలని ఆయన అన్నారు.

ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏవేవో కొత్త చట్టాలు చేస్తామని చెప్పాయని గుర్తు చేశారు. తాను మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత, పనికిమాలిన చట్టాలను తీసేస్తున్నానని చెప్పారు. కాలదోషం పట్టిన చట్టాలను రోజుకొకటి తీసేస్తే, తనకు చాలా సంతోషమని స్పష్టం చేశారు.

భారతదేశానిది అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, ఈ వ్యవస్థలో పేదలకు భాగస్వామ్యం ఉండాలా? వద్దా? అందుకే ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టానని, పథకానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా జీరో ఖాతా తెరవమన్నానని, కానీ, భారతీయులు ఎంత నిజాయితీ పరులంటే ఉచితంగా తీసుకోలేదని, అందుకు నిదర్శనం ఒక్కరోజే ఈ పథకం కింద 1500 కోట్లు ఖాతాలో జమ అయ్యాయని, ఇప్పటిదాకా నాలుగు కోట్ల మంది భాగస్వాములయ్యారని తెలిపారు.

భారత్ మాతాకీ జై

భారత్ మాతాకీ జై

అమెరికా గడ్డపై 18 వేల మంది భారతీయులు గళమెత్తి భారత్‌మాతాకీ జై అంటు చేసిన నినాదాలు మిన్నంటాయి.

హరహర మోడీ..

హరహర మోడీ..

అభిమానులంతా హరహర మోడీ అంటూ నినదిస్తుండగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో అడుగుపెట్టారు.

నెహ్రూ జాకెట్

నెహ్రూ జాకెట్

నెహ్రూ జాకెట్‌, పసుపురంగు కుర్తా ధరించిన మోడీ ముకుళిత హస్తాలతో అభిమానులకు అభివాదం చేస్తూ వేదికపైకి వచ్చారు.

నినాదాల మధ్యనే..

నినాదాల మధ్యనే..

జాతీయ గీతాలాపన తర్వాత అభిమానుల నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. భారతమాతాకీ జై అంటూ నినదించారు.

అదిరిన మాడిసన్ స్క్వేర్

అదిరిన మాడిసన్ స్క్వేర్

అభిమానుల్లోని దేశభక్తి భారత్‌ మాతాకీ జై నినాద రూపంలో న్యూయార్క్‌ నగరాన్ని ప్రతిధ్వనింపజేసింది.

హిందీలో ప్రసంగం..

హిందీలో ప్రసంగం..

భాయియో ఔర్‌ బహెనో అంటూ మోడీ తనప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు, నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు సభాప్రాంగణం కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది.

ఎన్నారైలకు ఆహ్వానం

ఎన్నారైలకు ఆహ్వానం

ఇక్కడ ఉన్న భారతీయుంతా ప్రవాసీ దివస్‌కు భారత్‌ రావాలంటూ ఆయన ఆహ్వానం పలికినప్పుడు మేం సిద్ధం అంటూ అక్కడకు వచ్చిన భారతీయులు నినదించారు.

ప్రసంగం ప్రారంభం ఇలా..

ప్రసంగం ప్రారంభం ఇలా..

భారత్‌ మాతాకీ జై నినాదంతో తన ప్రసంగాన్ని మొదలు పెట్టి నరేంద్ర మోడీ అదే నినాదంతో ప్రసంగాన్ని ముగించారు. అంతేకాక అభిమానులందరితోనూ మూడుసార్లు ఆ నినాదాన్ని చెప్పించారు.

ఉపవాసం ఉంది నేను..

ఉపవాసం ఉంది నేను..

‘ఉపవాసం ఉన్నది నేను... మీరు కాదు. మరింత గట్టిగా చెప్పండి'' అంటూ వచ్చినవారిని ఉత్సాహపరిచారు.

ఉపవాసం ఉంది నేను..

ఉపవాసం ఉంది నేను..

‘ఉపవాసం ఉన్నది నేను... మీరు కాదు. మరింత గట్టిగా చెప్పండి'' అంటూ వచ్చినవారిని ఉత్సాహపరిచారు.

భారత అంతరిక్ష చరిత్ర సిగలో కలికితురాయిలా అమరిన ‘మార్స్‌' విజయ యాత్రని అమెరికా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్వేగ స్వరంతో గుర్తుచేసుకొన్నారు. అహ్మదాబాద్‌లో ఒక కిలోమీటర్‌ దూరానికి ఆటోవాళ్లు పది రూపాయలు వసూలు చేస్తారని, కానీ, అంతే దూరానికి కేవలం 7రూపాయల వంతున ఖర్చుతోనే అంగారక గ్రహం చేరామని, ఇది భారత్‌ శాస్త్రవేత్తల సమర్థత కాదా అని ఆయన అన్నారు. తొలి ప్రయత్నంలోనే అరుణగ్ర హాన్ని ముద్దాడిన దేశం కూడా భారతేనని గుర్తు చేశారు. ఇప్పటివరకు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లే అరుణగ్రహంపై అడుగుపెట్టాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+