మోడీ ఏడాది పాలనపై పెదవి విరిచిన అమెరికా మీడియా
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఏడాది పాలన పైన అమెరికా మీడియా విమర్శలు గుప్పించింది. మోడీ చెబుతున్న మేకిన్ ఇండియా కేవలం ఓ హైప్ మాత్రమేనని వ్యాఖ్యానించింది. ఎన్డీయే ఏడాది పాలనపై అమెరికా మీడియా పెదవి విరిచింది.
మేక్ ఇన్ ఇండియాకు మోదీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, కానీ ఇప్పటి వరకూ అది ప్రచారానికే పరిమితమైందని విమర్శించింది. ఉద్యోగ కల్పనపై భారీ అంచనాలు పెట్టుకున్నా జాబ్ మార్కెట్ ఇప్పటికీ స్తబ్ధుగానే ఉందని వ్యాఖ్యానించింది.

వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆర్థికాభివృద్ధిని పునరుజ్జీవింపచేయడానికి, మార్పు కోసం ప్రజలు మోడీకి అధికారం ఇచ్చారని, కానీ, ఆ ఆశలు అడియాసలు అవుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆర్థిక వ్యవస్థ కుంటినడక నడుస్తోందని పేర్కొంది.
కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ద్రవ్యోల్బణ ఆధారిత రుణాలు 2004 నుంచి ఎన్నడూ చూడని స్థాయికి దిగజారాయని, వరుసగా ఐదో నెలలోనూ ఎగుమతులు పడిపోయాయని వివరించింది. విదేశాల నుంచి చూస్తే, భారతదేశం ఇప్పుడు ఆశావహంగా కనిపిస్తోందని, స్వదేశంలో మాత్రం, ఉద్యోగాల పెరుగుదల మందకొడిగా ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications