టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేసులో నరేంద్ర మోడీ
న్యూయార్క్: ప్రముఖ అంతర్జాతీయ 'టైమ్' ప్రదానం చేసే 'ఈ ఏటి మేటి వ్యక్తి' టైటిల్ రేసుకు ఎంపిక చేసిన 42 మంది ప్రపంచ అగ్రగణ్యులలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి స్థానం లభించింది. పలువురు నాయకులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో కూడిన ఈ జాబితాలోకెక్కిన భారత ఏకైక రాజకీయ నాయకుడు ఆయనే.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జపాన్ ప్రధాని షింబో అబె, సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్, పాక్ టీనేజ్ సంచలనం మలాలా, అమెజాన్ సిఈవో జెప్ బెజోస్, బ్రిటిష్ సింహాసనానికి కొత్త వారసుడు జార్జ్‌లతోపాటు అమెరికా జాతీయ భద్రత సంస్థ గుట్టురట్టుచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ పేరు కూడా పరిశీలనలో ఉండటం గమనార్హం.

ఇక టైటిల్ విజేతను నిర్ణయించేది సంపాదకవర్గమే. "మంచిగానో, చెడ్డగానో ఈ ఏడాది వార్తల్లోకెక్కినవారిలో ఎవరిని అత్యంత ప్రభావశీలిగా భావిస్తున్నదీ ఓటుద్వారా తెలియజేయండి'' అని పాఠకులను కోరింది.
ఈ నెల 20 దాకా సాగిన ఆన్‌లైన్ పోలింగ్‌లో మోడీ 2,650 ఓట్లతో (25 శాతం) అగ్రస్థానంలో ఉండగా, స్నోడెన్ 7 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications