Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికాలో మరింత విస్తరించిన ప్రాణాంతక వైరస్: తొలిసారిగా చిన్నారిలో గుర్తింపు: పిల్లలు భద్రం

వాషింగ్టన్: ప్రమాదకరమైన మంకీపాక్స్ అమెరికాలో మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో ఈ మహమ్మారి పాజిటివ్ కేసులు కేరళలో నమోదయ్యాయి. అక్కడితో దీని వ్యాప్తి ఆగట్లేదు. తాజాగా అమెరికాలో మంకీపాక్స్ తొలి పాజిటివ్ కేసు నమోదైంది. కాలిఫోర్నియాకు చెందిన ఓ చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ బారిన పడ్డ వారందరూ పెద్దలే. తొలిసారిగా చిన్నారికీ సోకడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 14,000కుపైగా మంకీపాక్స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 14,000 కేసుల్లో అత్యధికం యూరప్ దేశాల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా నిర్ధారించింది. ఆఫ్రికన్ దేశాల్లో అయిదు మంది మృత్యువాత పడినట్లు స్పష్టం చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదనే సందేశాన్నీ ఇచ్చింది డబ్ల్యూహెచ్‌ఓ. ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలంటూ హెచ్చరికలను జారీ చేసింది.

Monkeypox outbreak in US: Cases have been identified for the first time in children in California

అమెరికాలో 2,891 మంకీపాక్స్ కేసులు నమోదు కాగా.. తొలిసారిగా ఓ చిన్నారికి సోకడం దాని విస్తరణ తీవ్రతకు అద్దం పడుతోంది. మంకీపాక్స్ వెలుగులోకి వచ్చిన వెంటనే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ చిన్నారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తోన్నారు. కాలిఫోర్నియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్సను అందిస్తున్నామని, చిన్నారి ఆరోగ్యం బాగుందని సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జెన్నిఫర్ మెక్‌క్విస్టన్ తెలిపారు.

ఈ వైరస్ బారిన పడిన వారిలో హోమో సెక్సువల్స్, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్లే అధికంగా ఉన్నారని జెన్నిఫర్ చెప్పారు. మంకీపాక్స్ కేసులను విస్తరించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని వైట్‌హౌస్ వెల్లడించింది. 3,00,000 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేసినట్లు వైట్‌హౌస్ హెల్త్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆశీష్ ఝా తెలిపారు. చాలినంత వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని, మంకీపాక్స్ మరణాలను అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+