ఆ దేశంపై కోతుల దండయాత్ర.. చీకట్లోకి ప్రజలు
రామాయణంలో వానర జాతి మొత్తం శ్రీరాముడి వైపు నిలబడి రామసేతు నిర్మించి శ్రీలంకలోని రావణాసురుడిని సంహరించిందని మనం చదువుకున్నాం. మళ్లీ ఇప్పుడు ఇన్ని వందల సంవత్సరాలకు అదే దేశంపై వానర జాతి దండయాత్ర చేపట్టింది. ఆదేశ అధికారులు, ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి కోతులు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఇప్పుడు కొత్తగా కోతుల కష్టం వచ్చిపడింది. పూర్తి కథనం ఇక్కడ చూడండి.
శ్రీలంక.. భారతదేశానికి సరిహద్దు దేశం. ప్రస్తుతం ఈ దేశానికి సీత కష్టాలు వచ్చాయి. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో దేశం అట్టుడికిపోతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై వ్యతిరేకత చాటుతున్నారు. అయితే ఇప్పుడు కోతులతో ఆ దేశానికి కొత్త కష్టం వచ్చిపడింది. గత కొన్ని రోజులుగా ఆ దేశం చీకట్లోనే మగ్గుతోంది. శ్రీలంక దేశానికి ఆయువుపట్టుగా ఉన్న సీలాన్ ఎలక్ట్రిసిటీ బోర్డు పరిధిలోని సబ్ స్టేషన్లపై కోతుల గుంపు పడింది. కోతుల గుంపు స్టేషన్ లోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది. కోతులు చేసిన నిర్వాకానికి శ్రీలంకలో విద్యుత్ సంక్షోభం వచ్చింది. ఆది, సోమ అని తేడా లేకుండా ప్రతిరోజూ అక్కడ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ప్రజలు. కరెంట్ లేక పరిశ్రమలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ , ఆస్పత్రులు వెలవెల బోతున్నాయి.

చుక్క నీరు లేదు..
విద్యుత్ సమస్య వల్ల శ్రీలంకలో నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని.. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరింత సమయం పట్టొచ్చని నేషనల్ వాటర్ సప్లై అండ్ డ్రైనేజీ బోర్డు సూచించింది.












Click it and Unblock the Notifications