పశుపతినాథ్ ఆలయంపై మోడీ ఎఫెక్ట్! చిరు కూడా..
ఖాట్మాండ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల నేపాల్‌లో పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కూడా తన పుట్టిన రోజు నాడు నేపాల్‌లో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మోడీ, చిరులు పశుపతినాథ్ ఆలయానికి విరాళాలు ఇచ్చారట.
పశుపతి ఏరియా డెవలప్‌మెంట్ ట్రస్ట్ (పీఏడీటీ) చీఫ్ గోవింద టాండన్ మాట్లాడుతూ.. మోడీ స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పశుపతినాథ్ ఆలయానికి భక్తులు పెరిగారని, ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారని తెలిపారు.

ప్రత్యేక పూజలు చేసిన మోడీ దేవాలయానికి రూ.2 కోట్ల విలువైన 2,500 కిలోల ఎర్రచందనం దంగులను విరాళంగా ఇచ్చారట. మోడీ దేవాలయంలో అరగంట పాటు గడిపారు.
చిరంజీవి కూడా రూ.2 లక్షలను పశుపతినాథ్ ఆలయానికి విరాళంగా ఇచ్చి ప్రత్యేక పూజలు జరిపించాలని గోవింద్ టాండన్ చెప్పారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా తాజాగా ఆలయాన్ని సందర్శించి రూ.5,100 విరాళంగా ఇచ్చారని చెప్పారు.












Click it and Unblock the Notifications