ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా రాకెట్ల దాడి: పలువురు దుర్మరణం: వందమందికి పైగా గాయాలు

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఎడతెరిపి లేకుండా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో చోటు చేసుకుంటోన్న పరిణామలు దిగ్భ్రాంతిని కలిగిస్తోన్నాయి. మొన్నటికి మొన్న బుచా మారణకాండపై ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నరమేథానికి రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ నిప్పులు చెరిగాయి. రష్యాకు మిత్రదేశంగా ఉంటూ వస్తోన్న భారత్ సైతం- బుచా నరమేథాన్ని తప్పు పట్టింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తును నిర్వహించాలని డిమాండ్ చేసింది. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ స్వయంగా పార్లమెంట్ వేదికగా ఈ ప్రకటన చేశారు.

బుచాలో ఎటు చూసిన సాధారణ పౌరుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న ఫొటోలు, కథనాలు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశాయి. రోడ్లు మీద, ఇళ్ల బయట, పార్కులు.. ఇలా ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు పడి ఉండటం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. దీని వెనుక రష్యా సైనిక బలగాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, నాటో సభ్య దేశాలు రష్యాపై మండిపడుతున్నాయి. భారత్ సైతం ఆ దేశాల జాబితాలో చేరింది. ప్రత్యక్షంగా రష్యా పేరును ఉటంకించకపోయినా- బుచా మారణకాండను తప్పు పట్టింది.

ఇప్పుడు తాజాగా అలాంటి దిగ్భ్రాంతికర దాడి మరొకటి చోటు చేసుకుంది. క్రమటోర్క్స్ రైల్వే స్టేషన్‌‌పై వరుస రాకెట్ దాడులు చోటు చేసుకున్నాయి. వెంటవెంటనే సంభవించిన ఈ దాడుల వల్ల 30 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ దాడికి రష్యా కారణమంటూ మండిపడింది. అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తోందంటూ ఆరోపించింది.

ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ఉంటుందీ క్రమటోర్క్స్ రైల్వే స్టేషన్. యుద్ధం ఆరంభమైన తరువాత- హ్యూమన్ కారిడార్ కోసం దీన్ని వినియోగిస్తోన్నారు. ప్రజలను సురక్షితంగా సరిహద్దులు, ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఉక్రెయిన్ సైన్యం- ఈ రైల్వే స్టేషన్‌ను వినియోగిస్తోంది. స్థానికుల తరలింపు పనులు సాగుతున్న వేళ.. ఈ రాకెట్ దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వందమందికి పైగా గాయపడటం, వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య పెరిగుతుందనే ఆందోళన నెలకొంది.

రాకెట్ల దాడి ఉదంతాన్ని ఉక్రెయిన్ రైల్వేస్ ధృవీకరించింది. 30 మంది మరణించినట్లు తెలిపింది. 100 మందికి పైగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొంది. రైల్వే స్టేషన్‌పై రాకెట్లను సంధించడాన్ని ఉక్రెయిన్ తప్పు పట్టింది. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్తదాహానికి ఇది నిదర్శనమి వ్యాఖ్యానించింది. ప్రాణాలను కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తోన్న పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తోందడానికి ఈ ఘటన నిదర్శనమని విమర్శించింది.

More than 30 people were killed after two rockets hit Kramatorsk Railway station in east Ukraine

భీతావహంగా రైల్వే స్టేషన్ పరిసరాలు..

రాకెట్ల దాడి అనంతరం క్రమటోర్క్స్ రైల్వే స్టేషన్ పరిసరాలు భీతావహంగా మారాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రయాణికులు తమవెంట తెచ్చుకున్న లగేజీ, ఇతర సామాగ్రిని అక్కడే వదిలేసి పరుగులు తీశారు. సంఘటన చోటు చేసుకున్న వెంటనే ఉక్రెయిన్ బలగాలు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. సహాయక చర్యలను చేపట్టాయి. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించాయి. ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం స్పందించేదు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+