షాక్: నగ్నంగా ఆడ, మగ కలిసి కోబ్లర్స్ బీచ్ లో ఈత, చారిటీ కోసమిలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

సిడ్నీ:బీచ్ లో అర్థనగ్నంగా ఒకరిద్దరూ స్త్రీలు కనిపిస్తేనే కళ్ళప్పగించి చూస్తాం. ఒకరిద్దరూ కాదు ఏకంగా వందలాది మంది మహిళలు, పురుషులు కూడ ఒంటి మీద నూలు పోగు లేకుండా బీచ్ లో సందడి చేశారు. అంతే కాదు నగ్నంగా స్త్రీ, పురుషులంతా సముద్రంలో ఈత కొట్టారు.

స్కిన్నీ ఓషియన్ స్విమ్స్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు సిడ్నీలోని కోబ్లర్స్ బీచ్ లో మొత్తం 1335 మంది స్మిమ్మర్లు ఆడ, మగ తేడా లేకుండా నగ్నంగా సముద్రంలో ఈత కొట్టారు.

అస్ట్రేలియాకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ చార్లీ టీయో ,సర్పింగ్ లో ప్రపంచ చాంపియన్ లేన్ బీచ్ లే లు కూడ నగ్నంగానే ఈత కొట్టారు.

More than a thousand skinny dippers bare it all in the annual nude swim in Sydney

నగ్నంగా బీచ్ లో రావడమే కాకుండా 300 నుండి 900 మీటర్ల స్మిమ్మింగ్ పోటీల్లో వీరంతా పాల్గొన్నారు. అయితే ఇవి స్మిమ్మింగ్ రేసులు మాత్రమే కాదని ఆర్గనైజర్లు తెలిపారు. అస్ట్రేలియన్ చారిటీల కోసం మంచి పనులు చేయడానికి నిధులు సమకూర్చడానికి ఈ న్యూడ్ స్విమ్ ఈవెంట్ ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బట్టలు లేకుండా నీళ్ళలో సరదాగా దిగండి , న్యూడ్ గా ఉండడం మాత్రమే కాదు మిమ్మల్లిన మీరు ప్రకృతితో మమేకమై సరదాగా గడుపుతున్నామని బావించండి అంటూ కార్యక్రమానికి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బీచ్ లే చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
More than 1,000 swimmers have stripped off for the fifth annual Sydney Skinny ocean swim at Cobbler's Beach.The 'spectator free' event kicked off on Sunday at the secluded beach at Middle Head at the Sydney Harbour National Park.
Please Wait while comments are loading...