బస్సును ఢీకొన్న ఆయిల్ ట్రక్: మంటల్లో యువ అథ్లెట్లు సహా 31 మంది ఆహుతి
రబాట్: మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారంనాడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మరణించారు. వారిలో ఎక్కువ మంది యువ అథ్లెట్లు ఉన్నారు. యువ అథ్లెట్లు, కోచ్‌లు ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్రక్ ఢీకొట్టింది.
ఆయిల్ ట్రక్ ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు అగ్నీకీలల్లో ఆహుతైంది. దీంతో మంటల్లో చిక్కుకుని యువ అథ్లెట్లు మరణించారు.

ఉత్తర మొరాకోలో పోటీల్లో పాల్గొన్న తర్వాత అథ్లెట్లు తిరిగి వస్తుండా టన్ టన్ నగరం సమీపంలో ఈ ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అథ్లెట్లతో సహా 31 మంది మంటల్లో కాలిపోయారు.
ప్రమాదంలో మరో 9 మంది గాయపడ్డారు. ట్రక్ హైడ్రో కార్బన్‌ను రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రక్ కూడా పూర్తిగా ధ్వంసమైంది.












Click it and Unblock the Notifications