వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికెన్ ప్రియులకు షాక్.. 646 కేఎఫ్‌సీ ఔట్‌లెట్లు క్లోజ్!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లండన్: యూకేలో 646 కేఎఫ్‌సీ ఔట్‌లెట్లు మూతపడ్డాయి. కారణం.. చికెన్ అందకపోవడమే. అవును, చికెన్ సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులతో చివరికి యూకేలోని వందలాది కేఎఫ్‌సీ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేశారు.

అసలేం జరిగిందంటే.. జర్మనీకి చెందిన ప్రముఖ కొరియర్ సంస్థ డీహెచ్ఎల్‌తో చికెన్ సరఫరా ఒప్పందం రద్దు చేసుకోవడంతో కేఎఫ్‌సీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. కేఎఫ్‌సీ అధికారిక వెబ్‌సైట్ తెలిపిన దాని ప్ర‌కారం యూకే, రిప‌బ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రాంతాల్లో 646 ఔట్‌లెట్లు మూత‌ప‌డ్డాయి.

kfc

చికెన్ కొరత కారణంగా తమ రెస్టారెంట్లు మూతపడ్డాయని, ఇందుకు క్షమించాలని కేఎఫ్‌సీ తన కస్టమర్లను ఒక ప్రకటనలో కోరింది. అయితే ఎన్నిరోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందో, తిరిగి ఎప్పుడు తమ ఔట్‌లెట్లు తెరుచుకుంటాయో కూడా ఇప్పట్లో చెప్పలేమని కేఎఫ్‌సీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

యూకేలో కేఎఫ్‌సీ దుకాణాల‌న్నీ దాదాపుగా ఫ్రాంచైజీల‌తోనే న‌డుస్తున్నాయి. కొన్ని మీడియా క‌థ‌నాల ద్వారా ఒక రోజుకు 1మిలియ‌న్ పౌండ్ల వ‌ర‌కూ న‌ష్టం వ‌స్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఎంతో పెద్ద వ్యాపారం క‌నుక ఇదంతా అంచ‌నాగానే కొట్టిపారేస్తున్నారు.

కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో 80శాతం ఫ్రాంఛైజీలపైనే నడుస్తున్నాయి. సోమవారం యూకేలోని 900 కేఎఫ్‌సీ ఔట్‌లెట్స్‌లో ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్‌, నార్త్‌ ఐర్లాండ్‌లో 300 ఔట్‌లెట్స్‌ మాత్రమే తెరిచి ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్లలో పరిమిత మెనూను కొన్ని గంటల పాటు అందుబాటులో ఉంచుతున్నారు.

ఉద్యోగుల్ని సెలవులు తీసుకోవాలని సూచిస్తున్నామని, అయితే బలవంతం చేయట్లేదని, తమ బృందాలు సమస్యలు పరిష్కరించేందుకు అనుక్షణం కృషి చేస్తున్నాయని, త్వరలో ఇబ్బందులు తొలగిపోయి తిరిగి రెస్టారెంట్లు ప్రారంభమవుతాయని, అయితే ఎప్పుడు ప్రారంభమవుతాయన్న అంశంపై కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని కేఎఫ్‌సీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

English summary
The fast food chain KFC has been forced to temporarily close most of its UK outlets after problems with a new delivery contract led to a chicken shortage. A total of 562 KFC outlets remained shut following a weekend of disruption that peaked on Sunday night at 646 closures. KFC published a list of only 338 of its 900 stores that were still open on Monday night. Many were offering a limited menu and restricted opening hours. The chicken delivery problem is so severe that the company cannot say when operations will be back to normal. But it said it was working “flat out” to resolve the crisis. Signs on many of the closed stores said: “Sorry, we’re closed. We deliver our chickens fresh into our restaurants, but we’ve had a few hiccups with the delivery today. We wouldn’t want to be open without offering our full menu, but we’ll be back at the fryers as soon as we can.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X