వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూసుకుంటున్న లిఫ్ట్ తలుపులు.. వాటి మధ్యలో చిన్నారి

ఓ అపార్ట్ మెంట్ లో లిప్ట్ తలుపులు అప్పుడే మూసుకోబోతున్నాయి.. అనుకోకుండా ఓ చిన్నారి తప్పటడుగులు వేసుకుంటూ ఆ తలుపుల మధ్యకు వెళ్లి నిలబడింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మలేసియా: ఓ అపార్ట్ మెంట్ లో లిప్ట్ తలుపులు అప్పుడే మూసుకోబోతున్నాయి.. అనుకోకుండా ఓ చిన్నారి తప్పటడుగులు వేసుకుంటూ ఆ తలుపుల మధ్యకు వెళ్లి నిలబడింది. లిఫ్ట్ తలుపులకు సెన్సార్లు కూడా లేవు.. ఆ తరువాత ఏం జరిగుంటుంది?

ఊహించుకోవడానికే భయం వేసే ఈ ఘటన మలేసియాలోని ఓ అపార్ట్ మెంట్ లో నిజంగా జరిగింది. మలేసియాలోని బాటు ఉబన్ లోని సన్నీపాయింట్ కాంప్లెక్స్ లో నివసిస్తున్న సన్నిహితులను కలిసేందుకు ఓ మహిళ తన మూడేళ్ల కుమార్తెను వెంటతీసుకుని వెళ్లింది.

 Mother's desperate KICK saves her daughter, 3, from being crushed in lift doors

ఈ క్రమంలో ఆ చిన్నారి ఆడుకుంటూ లిఫ్ట్ వద్దకు చేరుకుంది. అప్పుడే లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. అభం శుభం తెలియని ఆ చిన్నారి లోపలికి వెళ్లేందుకు ప్రయతిస్తూ ఉన్నట్లుండి మధ్యలోనే ఆగింది. అప్పుడు పాప సరిగ్గా తలుపుల మధ్యన ఉంది.

దూరం నుండి ఈ దృశ్యం చూసిన ఆ చిన్నారి తల్లికి పైప్రాణాలు పైనే పోయాయి. సరిగ్గా అప్పుడే లిఫ్ట్ తలుపులు మూసుకోబోతున్నాయి. పైగా ఆ లిఫ్ట్ తలుపులకు సెన్సార్లు కూడా లేవు. ఆ పాప తల్లి పరుగు పరుగున వచ్చింది. లిఫ్ట్ ఒక తలుపును గట్టిగా చేతితో పట్టుకుని.. మరో పక్క నుంచి పాపను కాలితో గట్టిగా అవతలికి తన్నింది.

దీంతో ఆ చిన్నారి విసురుగా పక్కకి పడడం... సరిగ్గా అదేసమయంలో లిఫ్ట్ తలుపులు మూసుకోవడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఆ తల్లి తన కుమార్తెను తీసుకుని బతుకుజీవుడా అనుకుంటూ అక్కడ్నించి వెళ్లిపోయింది.

English summary
This mother was forced to kick her daughter to safety to stop her being crushed in the doors of a lift. The three-year-old girl wandered towards the open elevator but paused just in front of it. The doors - which had no sensors - began closing on her as the frantic mother ran over screaming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X