మరోసారి బాంబు పేలుడుతో అట్టుడికిన సౌదీ
రియాద్: మరోసారి సౌదీ ఆరేబియా పేలుళ్లతో అట్టుడుకింది. ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నట్లు సౌదీకి చెందిన ఆల్ అరేబియా టెలివిజన్ సోమవారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఖతీఫ్, మదీనాల్లో ఈ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.
జెడ్డాలో మారణహోమం సృష్టించిన ఘటన నుంచి తేరుకోకముందే ఈ పేలుళ్లు సంభవించారు. ఖతీఫ్‌లో తనను పేల్చుసుకున్న సూసైడ్ బాంబార్ శరీరం ముక్కలు ముక్కలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మసీదు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

సౌదీలో ఇది రెండో సంఘటన. జెడ్డాలో రంజాన్ ముగింపు సందర్భంగా దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజా సంఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం.
మదీనాలోని సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ వద్ద మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు చినిపోయినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications