అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పులు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.25 గంటలకు దక్షిణ కాలిఫోర్నియాలో ఈ కాల్పులు జరిగాయి.
కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మరణించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కాల్పులు జరిగిన చోట రెండు అంతస్థుల భవనం ఉంది. అందులో న్యాయ సంబంధమైన కంపెనీలున్నాి.

కాల్పులు జరిగిన సమయంలో భవనంలోంచి పలువురు పరుగెత్తుతూ కనిపించారు. వెంటనే పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications