'భారత్ ఆ భ్రమలోంచి బయటకు రావాలి.. ఇకపై'.. అసిమ్ మునీర్ సంచలనం
ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్.. పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDS) గా బాధ్యతలు తీసుకున్నాక.. భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ భవిష్యత్తులో తమపై దాడి చేస్తే వెంటనే ప్రతిదాడికి పాల్పడతామని మరోసారి ప్రగల్భాలు పలికారు. పాకిస్థాన్ శాంతియుతంగా ఉంటుందని.. కానీ తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో మాత్రం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. అలాగే అఫ్గానిస్తాన్ లోని తాలిబాన్లు పాకిస్థాన్ ను కానీ నిషేధిత టీటీపీ గ్రూప్ ను కానీ ఎంచుకోవాలని అసిమ్ మునీర్ సిగ్నల్ ఇచ్చారు.
పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDS) గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అసిమ్ మునీర్.. భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్.. పాకిస్థాన్ పై దాడులకు పాల్పడితే.. పాకిస్థాన్ ప్రతి చర్య వేగంగా, సమర్థవంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు దేశాలతో పాకిస్థాన్ శాంతియుతంగా వ్యవహరిస్తుందని.. కానీ తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు వెనకడుగు వేయదని అసిమ్ మునీర్ స్పష్టం చేశారు. అలాగే తాబిబన్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కార్యక్రమంలో పాకిస్థాన్ లో మూడు సర్వీసులు అయిన పాకిస్థాన్ ఆర్మీ, పాకిస్థాన్ నేవీ, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గౌరవ సత్కారం పొందారు.
ఫీల్డ్ మార్షన్ అసిమ్ మునీర్ గత వారమే పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDS) గా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లపాటు ఈ హోదాలో కొనసాగనున్నారు. దాంతోపాటుగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ దాడుల వెనుక ఉన్నట్లు తేలిన నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక స్థావరాలపై దాడులకు పాల్పడింది. వాటిని ధ్వంసం చేసింది. మే 7 నుంచి 10 వరకు జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ లో వందలాది మంది ఉగ్రమూకలను భారత సైన్యం హతమార్చింది.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications