నా తల్లి 'కిల్లర్' ముషార్రఫే: బెనజీర్ భుట్టో తనయుడి ఆరోపణ

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: తన తల్లి బెనజీర్ భుట్టో హత్యకు పర్వేజ్ ముషార్రఫ్ కారణమని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చైర్మన్ బిలావల్ భుట్టో ఆరోపించారు. బెనజీర్ భుట్టో పదవ వర్ధంతి సందర్భంగా ఆయన బుధవారం నివాళులు అర్పించారు.

తన తల్లి బెనజీర్ భుట్టో భద్రతను ముషార్రఫ్ తగ్గించారని, ఆ కారణంగానే ఆమె హత్యకు గురైందని ఆయన అన్నారు. ముషార్రఫ్ హంతకుడు అంటూ ఆయన నివాదాలు చేశారు. ఈ మేరకు డాన్ ఆన్‌లైన్‌లో వార్త ప్రచురితమైంది.

Musharraf purposely sabotaged my mother's security so that she would be killed: Bilawal Bhutto

తన తల్లి హత్యకు గురి కావడానికి ముషార్రఫ్ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారని అంతుకు ుదు బీబీసితో మాట్లాడుతూ అన్నారు. భద్రతను తగ్గించడం ద్వారా ఆమె హత్యకు గురయ్యేట్లు ముషార్రఫ్ చేశారని ఆయన ఆరోపించారు.

తన తల్లి మరణానికి ముషార్రఫ్ బాధ్యుడని ఆయన అన్నారు. ఉగ్రవాదులకు క్లిన్ చిట్ ఇచ్చి నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసు అధికారులను బలి చేశారని ఆయన ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan Peoples Party (PPP) chairman Bilawal Bhutto branded former President Pervez Musharraf as the "killer" of his mother Benazir Bhutto.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి