బేస్‌బాల్ బ్యాట్‌తో యువతిపై!: కారుకు అడ్డు వచ్చిందని, రోడ్డుపైనే మృతి

Subscribe to Oneindia Telugu

వర్జీనియా: తన కారుకు అడ్డం వచ్చారన్న కారణంతో.. ఓ యువకుడు సహనం కోల్పోయి.. బేస్‌బాల్ బ్యాట్‌తో దాడికి దిగాడు. ఈ ఘటనలో నబ్రా హస్సానెన్ (17) అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన బాలికను ఓ మడుగులో పడేసి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ పోలీసులు కనిపెట్టేయడంతో హత్య ఉదంతం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. రంజాన్ మాసం కావడంతో నబ్రా హస్సానెన్(17) అనే యువతి తెల్లవారుజామున ప్రార్థనలకు తన తోటి మిత్రులతో హాజరైంది. ప్రార్థనలు ముగిసిన తర్వాత స్నేహితులతో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లారు. అక్కడినుంచి అంతా కలిసి సైకిళ్లపై ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో డార్విన్ మార్టినెజ్ టోర్స్(22) అనే యువకుడు ఆ రోడ్డు గుండా వేగంగా దూసుకొచ్చాడు.

Muslim girl returning from mosque killed with bat, drowned in pond; cops investigate 'road rage'

అతని కారుకు అడ్డు తప్పుకోవాలంటూ పలు మార్లు హారన్ కొట్టాడు. ఇదే క్రమంలో తీవ్ర అసహనానికి లోనైన అతను.. ఓ బేస్ బాల్ బ్యాట్‌తో వారిని వెంటపడి తరిమాడు. అది కాస్త నబ్రా తలకు బలంగా తాకడంతో.. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ మడుగులో పారేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీయించి అతన్ని అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A teenage Muslim girl killed by a bat-wielding motorist near a Virginia mosque was an apparent victim of "road rage" and her death is not being investigated as a hate crime, police said on Monday.
Please Wait while comments are loading...