వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీకి భారీ షాకిచ్చిన ఫేస్‌బుక్‌ -హింసను ప్రేరేపిస్తున్నారంటూ మిలిటరీ అధికారిక పేజీ తొలగింపు

|
Google Oneindia TeluguNews

మయన్మార్ లో కొనసాగుతోన్న సంక్షోభం, హిసాత్మక పరిస్థితులపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సంస్థ సంచలన రీతిలో స్పందించింది. రాజకీయనేతల నుంచి మయన్మార్ పగ్గాలను చేజిక్కించుకున్న ఆ దేశ సైన్యం.. ప్రస్తుతం ప్రజలపై నిరంకుశత్వం ప్రదర్శిస్తూ రెచ్చిపోతుండటం, నిరసన ప్రదర్శనలు చేస్తోన్న జనాన్ని పిట్టల్ని కాల్చినట్లు చంపేయడం తదితర పరిణామాల నేపథ్యంలో ఫేస్ బుక్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో -25న ఓవైసీ ర్యాలీఅసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో -25న ఓవైసీ ర్యాలీ

ఆర్మీకి షాక్..

ఆర్మీకి షాక్..

మయన్మార్ లోని మాండలే నగరంలో శనివారం జరిగిన పౌర నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో.. ఆ దేశ మిలిటరీకి సంబంధించిన అధికారిక పేజీని ఫేస్‌బుక్‌ తొలగించింది. హింసాత్మక విధానాలతో తమ సంస్థ నిబంధనలను మిలిటరీ పదేపదే ఉల్లంఘిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్ సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

జనంపై సైన్యం ఉక్కుపాదం

జనంపై సైన్యం ఉక్కుపాదం

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా దాదాపు అన్ని చోట్లా నిరసనలు జరుగుతున్నాయి. ఆందోళనల్ని అణిచివేసే క్రమంలో సైన్యం.. ఇప్పటికే ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసి, జనం వీధుల్లో రాకుండా కట్టడి చేసింది. జనమంతా సైన్యంపై గుర్రుగా ఉన్న పరిస్థితుల్లో.. వారిని కట్టడి చేసేందుకు జవాన్లు సరిపోరనే ఉద్దేశంతో జైళ్లలో మగ్గుతోన్న నేరస్తుల్ని సైతం వాడుకోవాలని ఆర్మీ అధికారులు నిర్ణయించడం కలకలం రేపుతున్నది. ఈ పరిణామాలపై..

ఫేస్‌బుక్ వివరణ..

ఫేస్‌బుక్ వివరణ..

''మా అంతర్జాతీయ విధానాలకు మేం కట్టుబడి ఉన్నాం. హింసను ప్రేరేపిస్తూ మా కమ్యూనిటీ ప్రమాణాలను పదేపదే ఉల్లంఘిస్తున్నందున.. 'టాట్మడా ట్రూ న్యూస్‌ ఇన్‌ఫర్మేషన్‌ టీం' అనే పేరుతో ఉన్న మిలిటరీ పేజీని తొలగిస్తున్నాం'' అని ఫేస్ బుక్ సంస్థ ప్రతినిధి ఒకరు ప్రకటనలో తెలిపారు. దీనిపై మిలిటరీ ప్రతినిధిలు స్పందించాల్సి ఉంది. కాగా,

Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..

చేసిన తప్పులకు చింతనా..

చేసిన తప్పులకు చింతనా..

నిజానికి మయన్మార్‌లో ఆన్‌లైన్‌ వేదికగా మిలిటరీ విద్వేష ప్రచారాల్ని నియంత్రించడంలో ఫేస్‌బుక్‌ విఫలమైందని గతంలో అంతర్జాతీయంగా ఆ సంస్థపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. చేసిన తప్పులకు చింతనా అన్నట్లుగా, మిలిటరీ విద్వేష ప్రచారాల్ని అడ్డుకునేందుకుగానూ ఫేస్‌బుక్‌ ఆ దేశంలోని పౌర హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం మయన్మార్ ను తన హస్తాల్లోకి తీసుకున్న ఆర్మీ చీఫ్‌ మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌ ఫేస్ బుక్ పేజీ 2018లోనూ తొలగింపునకు గురైంది.

English summary
A Facebook page run by the Myanmar junta's "True News" information service was kicked off the platform Sunday after the tech giant accused it of inciting violence. Security forces in the country have steadily increased violence against a massive and largely peaceful civil disobedience campaign demanding the return of deposed civilian leader Aung San Suu Kyi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X