మిస్టరీ కిల్లర్... పట్టిచ్చిన వారికి రూ.30 కోట్లు నజరానా!
1980లో మెల్ బోర్న్‌లో జరిగిన వరుస మహిళల హత్యకేసును ఛేదించడం ఆస్ట్రేలియన్ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. 1980-1981 మధ్య కాలంలో దుండగులు 14 నుంచి 73 ఏళ్ల వయసుగల ఆరుగురు మహిళలను హతమార్చారు. ఆనాటి న
సిడ్నీ: దశాబ్దాలు గడిచిన చిక్కువీడని ఓ మిస్టరీ కేసుతో ఆస్ట్రేలియన్ పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. చివరికి శనివారం మిస్టరీ కిల్లర్ ని పట్టిచ్చిన వారికి రికార్డు స్థాయి రివార్డు ప్రకటించారు.
1980లో మెల్ బోర్న్‌లో జరిగిన వరుస మహిళల హత్యకేసును ఛేదించడం ఆస్ట్రేలియన్ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. 1980-1981 మధ్య కాలంలో దుండగులు 14 నుంచి 73 ఏళ్ల వయసుగల ఆరుగురు మహిళలను హతమార్చారు. ఆనాటి నుంచి ఈ కేసు మిస్టరీగా మారింది.
ఈ కేసును ఛేదించేందుకు నడుంబిగించిన విక్టోరియా పోలీసులు సమాచారం అందించినా, మిస్టరీ ఛేదించినా ఒక్కో కేసుకు రూ.5 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు.

ఒక్కో కేసుకు రూ.5 కోట్ల చొప్పున మొత్తం 6 కేసుల్లో రూ.30 కోట్లు అన్నమాట. ఆస్ట్రేలియన్ పోలీసులు ప్రకటించిన రెండో అతిపెద్ద రివార్డు కూడా ఇదేనట.
అంతేగాకుండా ఎవరికైనా మిస్టరీలు ఛేదించే మేధాశక్తి ఉంటే పోలీసులను సంప్రదించాలని కూడా కోరారు.
అయితే ఈ రివార్డు ప్రకటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'దొంగలు పడ్డాక ఆర్నెల్లకు కుక్కలు మొరిగిన'చందంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications