నగ్నంగా ఫోటోలకు ఫోజులు.. 11 మంది గుర్తింపు, దేశ బహిష్కరణ
ఆధునికత మోజులో విశృంఖత్వం జడలు విప్పి నాట్యం చేస్తోంది. డెవలప్ పేరుతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సాంప్రదాయ భారతదేశంలోనే కొన్నిచోట్ల పాశ్చాత్య వాసన గుప్పుమంటోంది. ఇక దుబాయ్ లాంటి దేశాల్లో అయితే చెప్పలేం. ఇటీవల దుబాయ్‌లో ఉక్రెయిన్‌కి చెందిన మహిళలు నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీనిని దుబాయ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.

బాల్కనీలో నగ్నంగా నిల్చొని..
ఇటీవల కొందరు ఉక్రెయిన్ మహిళలు ఓ భవనం బాల్కనీలో నిల్చుని నగ్నంగా ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. ఆ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిని దుబాయి పోలీసులు గుర్తించారు. అలా గుర్తించిన 11 మంది ఉక్రెయిన్ మహిళలను దేశం నుంచి బహిష్కరించినట్టు అధికారులు వెల్లడించారు. పిచ్చి పీక్‌కి చేరినట్టు ప్రవర్తించి.. ఇలా చివరికీ దేశం నుంచి బహిష్కరించబడ్డారు.

ఫోటోలు తీయడంతో
చాలా మంది మహిళలు నగ్నంగా పట్టపగలు ఓ ఎత్తైన భవనం బాల్కనీలో నిల్చున్నారు. వారిని రష్యన్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో చిత్రీకరించాడు. ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫొటోలలో ఉన్న వారందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ గుంపులోని 11 మంది ఉక్రెయిన్ మహిళలను దేశం నుంచి బహిష్కరించారు. పోలీసుల విచారణలో పబ్లిసిటీ కోసమే ఈ పని చేసినట్టు నిందితులు చెప్పారని తెలుస్తోంది.

పిచ్చి పీక్‌కి చేరి..
పిచ్చి ముదిరితే ఇలానే వ్యవహరిస్తారు. బాల్కనీలో నగ్నంగా నిల్చొవడం ఏంటీ.. నిలబడి మరీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమా హవ్వా అని మేధావులు అంటున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. ఇంకేముంది ప్రభుత్వమే స్పందించింది. వారిపై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నది. తమ దేశంలో ఉండే అర్హత కోల్పోయిందని పేర్కొన్నారు. అధికారుల ఆదేశాలతో ఆ మహిళలపై చర్యలకు ఉపక్రమించారు. దేశ బహిష్కరణ వేటు వేశారు.