వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంటే వంటమనిషి: భూటాన్ పార్లమెంట్లో హిందీలో మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

థింపూ: భూటాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీకి భోజనం వండి పెట్టేందుకు గుజరాత్ భవన్ నుండి ప్రత్యేకంగా ఒక వంట మనిషి భూటాన్ వచ్చారు. దేశ విదేశాల్లో ఎక్కడ పర్యటించినా ఇంటి భోజనం, అదీ శాకాహారానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే ప్రధాని కోసం గుజరాత్ భవన్ నుంచి వంట మనిషి వారం ముందే భూటాన్ చేరుకున్నాడు. ఆయన అక్కడకు చేరేసరికి ప్రధాని బస చేసే తాజ్ తాషి హోటల్‌లోనే గుజరాతీ వంటకాలు సిద్ధం చేశాడు. ప్రధానితోపాటు ఆయన ప్రతినిధి బృందం కోసం ఈ హోటల్‌లో 50 గదులను కేటాయించారు. చివరకు భూటాన్ ప్రభుత్వం ఇచ్చిన అధికారిక విందులోనూ గుజరాతీ వంటకాలే వడ్డించారు. మోడీ శాకాహారి.

కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ భూటాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం భూటాన్ రాజధాని థింపూ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ టొబగేలతో అనేక అంశాలపై ఆయన లోతైన చర్చలు సాగించారు.

అటు పైన షెరింగ్ ఇచ్చిన అధికారిక విందులో ప్రసంగిస్తూ 'భారత్ ఫర్ భూటాన్; భూటాన్ ఫర్ భారత్ (బి4బి) మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ స్నేహ సంబంధాలను సుదృఢం చేసుకుందామని పిలుపునిచ్చారు. భారత్‌లో మారింది ప్రభుత్వమే తప్ప భూటాన్‌పై విదేశాంగ విధానంలో ప్రాధాన్యం మారబోదన్నారు. అభివృద్ధిలో సహకారం, ఆర్థిక బంధాల బలోపేతమే తన పర్యటన లక్ష్యమన్నారు. భూటాన్‌తో ద్యైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిస్తామని మోడీ అన్నారు.

భూటాన్‌లో ప్రగతికి, ప్రశాంత ప్రజా జీవనానికి తోడ్పాటుపై కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏ దేశానికైనా సంపద, సౌభాగ్యం మాత్రమే చాలవని, స్నేహశీలతగల ఇరుగుపొరుగు లేక పోతే శాంతి లోపిస్తుందని స్పష్టంచేశారు. భారత్‌వంటి స్నేహశీల పొరుగు దేశం ఉన్నందువల్లనే భూటాన్‌లో శాంతియుత సుఖ జీవనానికి హామీ లభించిందని పేర్కొన్నారు. పాకిస్థాన్, చైనాల వైఖరితో భారత్‌లో కొంత అశాంతి నెలకొన్నదన్న వాస్తవాన్ని ఈ వ్యాఖ్య ద్వారా నర్మగర్భంగా వ్యక్తం చేశారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆదివారం థింపూలోని రాజప్రసాదంలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్ చుక్, రాణి పెమా దంపతులతో భారత ప్రధాని మోడీ దృశ్యం.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ భూటాన్ పార్లమెంటును ఉద్దేశించి సోమవారం ప్రసంగించారు. పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. మంచి విద్యను అందిస్తే... దేశ మూలాలు బాగుపడతాయని మోడీ తెలిపారు. విద్య కోసం భూటాన్ ఎక్కువ నిధులు కేటాయించడం సంతోషదాయకమని అన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత్‌లో ప్రభుత్వాలు మారినా భూటాన్ తో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని మోడీ చెప్పారు. రాబోయే దశకంలో ఇంధన భద్రత అత్యంత కీలకమని తెలిపారు. భారత్ అభివృద్ధి చెందితే భూటాన్‌కు కూడా మేలు జరుగుతుందని మోడీ అన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ


హిమాలయ రాష్ట్రాలు, భూటాన్ మధ్య క్రీడాపోటీలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. మోడీ ప్రసంగం మొత్తం హిందీలోనే కొనసాగింది. కాగా, మోడీకి భూటాన్‌లో స్వాగతం పలుకుతున్న దృశ్యం.

English summary

 Speaking in crisp and fluent Hindi, Prime Minister Narendra Modi on Monday addressed the joint session at the Bhutan Parliament congratulating the political family of Bhutan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X