పాకిస్తాన్ లో గాయత్రి మంత్రాలాపన.. ముగ్ధుడై చప్పట్లు కొట్టిన నవాజ్ షరీఫ్

Posted By:
Subscribe to Oneindia Telugu

కరాచీ: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొలువుదీరిన ఓ కార్యక్రమంలో హిందూ యువతి చక్కగా గాయత్రి మంత్రం ఆలాపించి అందరి హృదయాలను దోచుకుంది. అక్కడ ఉన్న అందరూ చప్పట్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు దానిని శ్రద్ధగా విన్న ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా చప్పట్లతో తన హర్షం వ్యక్తం చేశారు.

ఈనెల 15న పాకిస్తాన్ లో మైనారిటీలు అయిన హిందువులు హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేయగా, దానికి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తోపాటు పలువురు ప్రభుత్వ పెద్దలు కూడా హాజరయ్యారు.

Narodha Malni’s Gayatri Mantra recitation impressed Nawaz Sharif

ఈ నేపథ్యంలో తొలుత మాట్లాడిన ఆయన హిందువులకు అన్ని రకాలా రక్షణ కల్పిస్తామని చెప్పారు. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడాన్ని ఖురాన్ అంగీకరించబోదని, పాక్ లో మైనారిటీల హక్కులు కాపాడడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.

అనంతరం నరోదా మాలిని అనే యువతి గాయత్రి మంత్రాన్ని ఆలపించి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేదికపై ఉన్న వారంతా కూడా అలౌకికానందానికి లోనై, మంత్రాలాపన పూర్తిగా విని చప్పట్లతో అభినందించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Holi is the festival of colour and it is celebrated all around the globe and it is major festival among Hindus, even Pakistani’s celebrate Holi with full heart. A video is going viral where Nawaz attended a Holi celebration in Karachi on 15 March. The best part in the video is a girl is reciting a Gayatri Mantra and all the people are listening it very carefully. Girl named Narodha Malni stole the show during the Holi celebration in Karachi with her rendition of the Gayatri Mantra. Pakistan Prime Minister Nawaz Sharif not only listened to the Gayatri Mantra, but also gave a big round of applause to Malni.
Please Wait while comments are loading...