వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యుడి మీదుగా బుధ, శుక్రగ్రహ సంచారం: మళ్లీ 2117లోనే: అద్భుతాన్ని ఆవిష్కరించిన నాసా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. సూర్యుడి మీదుగా శుక్ర, బుధ గ్రహ ప్రయాణాన్ని కెమెరాల్లో బంధించింది. అరుదుగా సంభవిస్తుంటుంది ఇది. ఇదివరకు దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను నాసా బంధించినప్పటికీ.. ఇది వాటన్నింటికీ పూర్తి భిన్నం. వీనస్ ట్రావెలింగ్‌ను నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్ మనిపించింది. దీనిమీద నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తోన్నారు.

సౌర వ్యవస్థలో సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే గ్రహాల్లో ఇది రెండోది. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అత్యంత వేడిని కలిగి ఉంటుంది. అత్యంత ప్రకాశవంతమైనది కూడా ఇదే. సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి 224.7 రోజులను తీసుకుంటుంది. రాత్రివేళ చంద్రుడి తరువాత మనం చూడగలిగే గ్రహాల్లో ఇదీ ఒకటి. ఈ సారి బుధగ్రహం (మెర్క్యురి)తో కలిసి సూర్యుడి చుట్టూ పరిభ్రమించింది ప్లానెట్ వీనస్.

శుక్రగ్రహ సౌర సంచారాలు 100 సంవత్సరాల వ్యవధిలో సంభవిస్తుంటాయి. ఇదివరకు శుక్రగ్రహం ఒక్కటే సూర్యుడి ఉపరితలం మీదుగా ప్రయాణించిన సందర్భం ఇదివరకు 2004లో చోటు చేసుకుంది. దాని తరువాత మళ్లీ 2012 లోనూ కనిపించింది. 2012లో సంభవించిన ట్రాన్సిట్ అనేది సుమారుగా ఏడు గంటల పాటు సాగింది. ఏడు ఖండాలకు చెందిన ప్రజలందరూ దీన్ని వీక్షించగలిగే అవకాశం కలిగింది అప్పట్లో.

NASA has shared a rare celestial event, transit of Venus across the face of Sun

జంట సౌర సంచారం అనేది ఇక మళ్లీ 2117లోనే చోటు చేసుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా సూర్యుడి మీదుగా సంచరించే సమయంలో గ్రహాల వాతావరణ పరిస్థితులు, వాటి కక్ష్యను అధ్యయనం చేయడం, వాటి ఉపరితలంపై చోటు చేసుకునే మార్పుల గురించి తెలుగుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సూర్యుడిలో సంభవించే మార్పులపై ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీని నాసా ఏర్పాటు చేసింది.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia

కొద్దిరోజుల కిందటే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురు, శని గ్రహాలు ఒకే సరళరేఖపై కనువిందు చేసిన విషయం తెలిసిందే. ఈశాన్యం నుంచి దక్షిణ దిశగా ఈ అయిదు గ్రహాలు ఓ విల్లు ఆకారంలో కనిపించాయి. బుధుడు (మెర్క్యురి), శుక్రుడు (వీనస్), కుజుడు (మార్స్), గురు (జుపిటర్) గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. ఇదలా కొనసాగుతుండగానే ఇప్పుడు తాజాగా సూర్యుడి మీదుగా వీనస్ సంచారం ఆసక్తిని రేపింది.

English summary
American space agency NASA has shared a rare celestial event that transit of Venus across the face of Sun, was captured by the agency's SDO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X