వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పేస్ షాట్ గన్ తయారు చేస్తున్న నాసా

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రపంచంలోనే తొలిసారిగా స్పేస్ షాట్ గన్ అభివృద్ది చెయ్యడానికి సిద్దం అయ్యింది. భూమికి సమీపంలోని ఆస్టరాయిడ్ ను ఈ షాట్ గన్ తో పేల్చడం ద్వారా ఏర్పడే చిన్న శకలాలను సేకరించి పరిశోధనలు చెయ్యాలని భావిస్తుంది.

శకలాలను పరిశోధించాలనే లక్షంతో ఈ స్పేస్ షాట్ గన్ తయారుచేస్తుంది. ఆస్టరాయిడ్ రీడైరెక్ట్ మిషన్ (ఏఆర్ఎమ్)లో భాగంగా నాసా షాట్ గన్ తయారీపై దృష్టి సారించిందని అమెరికాలోని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.

Nasa is developing world's first space shotgun that can blast asteroids

ఆస్టరాయిడ్ లోని భారీ భాగాన్ని వేరు చేసి, దాన్ని చంద్రుడి కక్ష్యలోకి పంపించి, అక్కడి నుంచి తదుపరి పరిశోధన కోసం మానవరహిత వ్యోమనౌక ద్వారా భూమికి చేర్చడం ఆస్టరాయిడ్ రీ డైరెక్ట్ మిషన్ ప్రధాన లక్షం.

ఆస్టరాయిడ్స్ భూమికి ప్రమాదం తీసుకు వస్తాయని మాత్రమే కాదు, వాటికున్న శాస్త్రీయ విలువల ఆధారంగా కూడా అంగారకుడి దిశగా నాసా ప్రయత్నాల్లో ఇది ఇక ముందడుగు అని నాసా ప్లానెటరీ సైన్స్ డైరెక్టర్ గ్రీన్ జిల్ తెలిపారు. ఆస్టరాయిడ్ భూమిని డీకొట్టుతుందని పుకార్లు రావడంతో అలాంటిది ఏమి లేదని ఇటీవల నాసా చెప్పిన విషయం తెలిసిందే.

English summary
The ARM aims to chop off a massive chunk of an asteroid and shift it into the Moon's orbit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X