వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యుడి వాతావరణంలో ఎంట్రీ: అంతుచిక్కని బ్రహ్మపదార్థాల గుట్టరట్టు: అద్భుతాన్ని ఆవిష్కరించిన నాసా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రచండ భానుడి రహస్యాలను బట్టబయలు చేయనుంది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్.. సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించింది. సూర్యుడి నుంచి వెలువడే శక్తిని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. శతాబ్దాలుగా అంతుచిక్కని బ్రహ్మపదార్థంగా ఉంటూ వస్తోన్న సౌర వ్యవస్థలో ఉన్న రహస్యాలను అన్వేషించే ప్రక్రియంలో ఇదో చారిత్రాత్మక విజయంగా నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు.

కల్లో కూడా ఊహించని సాహసం..

కల్లో కూడా ఊహించని సాహసం..


సౌర వ్యవస్థలోకి ప్రవేశించడం అంటే ఆత్మహత్యతో సమానం. అలాంటి ప్రయోగానికి నాసా పూనుకుంది. కనీసం కల్లో కూడా ఊహించని మిషన్‌ను విజయవంతం చేసింది. సూర్యుడికి సంబంధించిన గుట్టు రట్టు చేయడానికి 2018లో నాసా ఈ పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించింది. అసాధ్యమని భావించిన సోలార్ ప్రోబ్‌ ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేసింది. చరిత్ర సృష్టించింది. రెండు మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్‌తో ఉష్ణోగ్రతను వెలువడించే సూర్యుడి కొరోనాను దాటుకుందీ సోలార్ ప్రోబ్. సౌర వాతావరణంలోని విజయవంతంగా అడుగు పెట్టింది. కరోనా ఉపరితల వాతావరణంలోకి ప్రవేశించింది. తాను తలచుకుంటే సాధించనిదేమీ లేదని నిరూపించగలిగింది.

సూర్యుడిని తాకిన పార్కర్

సూర్యుడిని తాకిన పార్కర్

సూర్యుడి నుంచి వెలువడే శక్తి, ఉష్ణోగ్రత, సౌర తుఫాన్లు.. వీటన్నింటిని పరిశోధించడానికి నాసా ఇదివరకు పార్కర్ సోలార్ ప్రోబ్ (Parker Solar Probe)ను ప్రయోగించింది. ఇది- తన లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా వాషింగ్టన్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తాము ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడిని తాకిందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ ప్రకటించారు.

అయస్కాంత క్షేత్రాల నమూనాలు భూమికి..

అయస్కాంత క్షేత్రాల నమూనాలు భూమికి..


అసాధ్యం అనుకున్న కరోనాను దాటుకుని.. సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించిందని చెప్పారు. ఒక రోదసీ నౌక సూర్యుడి కొరొనాను దాటుకుని, ఉపరితల వాతావరణంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి అని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన కొరొనా సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించినట్లు చెప్పారు. అక్కడి నుంచి సూక్ష్మ ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన నమూనాలను సేకరించి గ్రౌండ్ స్టేషన్‌కు పంపించినట్లు థామస్ తెలిపారు.

ఇది..అద్భుతమే

ఇది..అద్భుతమే


ఇప్పటిదాకా అంతుచిక్కని ప్రశ్నలా మిగిలిన సూర్యుడి రహస్యాలు, అందులో చోటు చేసుకునే మార్పులు, సౌర తుఫాన్లు, వెలువడే శక్తి, భూమి, ఇతర గ్రహాలపై దాని ప్రభావం.. ఇలాంటి వన్నీ పరిశోధించే దిశగా ఓ అద్భుత విజయాన్ని సాధించినట్టయిందని, అంతరిక్ష పరిశోధనల్లో ఇదొక కీలకమైన మలుపుగా భావిస్తున్నామని పార్కర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, జాన్ హాప్కిన్స్ అప్లయిడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ హెడ్ నొవూర్ రావూఫి చెప్పారు.

2025 నాటికి మరింత చేరువగా..

ప్రస్తుతం ఈ పార్కర్ ప్రోబ్.. సూర్యుడికి 4.89 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఇదివరకు 8.13 మిలియన్ మైళ్ల దూరంలో ఉండేది. క్రమంగా అది తన వేగాన్ని పెంచుకుని.. సూర్యుడికి మరింత చేరువైంది. 2025 నాటికి సూర్యుడికి 3.83 మిలియన్ దూరానికి చేరుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే చివరి లీప్‌గా చెప్పారు. సోలార్ విండ్, మాగ్నిటిక్ ఫీల్డ్ డేటాతో పాటు సంపూర్ణ సూర్యగ్రహణాలు సంభవించిన సమయంలో చోటు చేసుకునే పెను మార్పుల గురించి ఆరా తీయగలమని అన్నారు.

English summary
The NASA's Parker Solar Probe represents much more than technological innovation. The spacecraft's landmark achievement has restored hope about solving age-old mysteries about the Sun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X