నసీరుద్దీన్ షా: తాలిబాన్లపై కామెంట్, మండిపడుతున్న ముస్లింలు

అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లపై నటుడు నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తాలిబాన్ల గెలుపుతో 'భారతీయ ముస్లింలలో కొందరు' సంబరాలు చేసుకుంటున్నారని వీడియోలో షా విమర్శించారు.
వారు ఇస్లాంలోని 'పాత అనాగరిక' సంప్రదాయాలకు అండగా నిలుస్తూ, ప్రమాదకర ఉదాహరణను నిర్దేశిస్తున్నారని షా పేర్కొన్నారు.
"సంస్కరించిన ఆధునిక ఇస్లాం కావాలో లేక దశాబ్దాల నాటి అనాగరికత కావాలో తమను తాము ప్రశ్నించుకోవాలి" అని అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్ గ్రూప్ తిరిగి వచ్చినందుకు సంబరాలు చేసుకునే వారికి 71 ఏళ్ల షా సూచించారు.
'హిందూస్తానీ' లేదా భారతీయ ఇస్లాం ప్రపంచంలో అన్నింటికంటే ప్రత్యేకమైనది, విభిన్నమైనది' అని షా అన్నారు. మనం గుర్తించలేనంతగా మార్పులు జరిగే సమయం రాకుండా దేవుడు చూడాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
''నేను భారతీయ ముస్లింని. నాకు రాజకీయ మతం అవసరం లేదు'' అని ఆయన అన్నారు.
https://twitter.com/_sayema/status/1433104998347333638
షా వ్యాఖ్యలు కొంత మంది ముస్లింలకు ఆగ్రహం తెప్పించాయి. సోషల్ మీడియా వేదికగా షాపై వారు కామెంట్లు చేశారు.
''తాలిబాన్‌ను ఖండించమని ఎందుకు చాలా మంది భారతీయ ముస్లింలను అడుగుతున్నారు? వారేమైనా తాలిబాన్లను ఎంపిక చేశారా, ఎన్నుకున్నారా లేదా ఆహ్వానించారా? ఈ విషయంపై స్పందించాలనే ఉచ్చులో సినీ రంగానికి చెందిన ప్రతిభ కలిగిన వారు కూడా పడుతున్నారు'' అని జర్నలిస్ట్ సబా నఖ్వీ ట్వీట్ చేశారు.
https://twitter.com/_sabanaqvi/status/1433328157814255622
'నటుడికి ఆవేశం అనవసరం' ఆయనకు 'తప్పుడు సలహా ఇచ్చారు' అని పాత్రికేయుడు, వ్యాఖ్యాత ఆదిత్య మీనన్ పేర్కొన్నారు.
''భారతీయ ముస్లింలు ఇప్పటికే ఆర్థిక బహిష్కరణ, మూక హింస, పోలీసుల దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు తాలిబాన్ మనస్తత్వం అనే వాదన ఒకటి తెరపైకి వచ్చి చేరింది. నిజంగా అలాంటి ముప్పేమీ లేదు'' అని ఆయన అన్నారు.
https://twitter.com/AdityaMenon22/status/1433483048155160598
అయితే అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుదారులు షాను ప్రశంసించారు. తాలిబాన్‌కు వ్యతిరేకంగా మరింత మంది ముస్లింలు మాట్లాడాలని పిలుపునిచ్చారు.
'అమానవీయ, అనాగరిక తాలిబాన్'కు వ్యతిరేకంగా షా మాట్లాడారని బీజేపీ ప్రభుత్వానికి గట్టి మద్దతుదారు అయిన చిత్ర నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ప్రశంసించారు.
''విద్యావంతులు, సృజనాత్మకత ఉన్న ముస్లింలు, ముఖ్యంగా బాలీవుడ్‌కు చెందినవారు ఎవరైనా మానవత్వానికి శత్రువులైన తాలిబాన్లకి వ్యతిరేకంగా మాట్లాడతారని ఆశిస్తున్నాను'' అని అన్నారు.
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆగస్టు 15న తాలిబాన్లు, అఫ్గానిస్తాన్‌ను తిరిగి వారి స్వాధీనం చేసుకున్నారు.
1996 నుంచి 2001 మధ్య అఫ్గానిస్తాన్‌ను నియంత్రించిన సమయంలో తాలిబాన్ కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేసింది. వారు బహిరంగ మరణ శిక్షలను సైతం అనుమతించారు. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లకుండా మహిళలపై నిషేధం విధించారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
- పంజ్‌షీర్‌లో తాలిబాన్లు, ప్రతిఘటన యోధుల మధ్య హోరాహోరీ పోరాటం.. 'వందల్లో మృతులు’
- 'కశ్మీర్‌కు స్వతంత్రం వద్దు.. పాకిస్తాన్లో కలవాలి’ అని గిలానీ ఎందుకు కోరుకున్నారు?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- ఏపీలోని ప్రైవేట్ విద్యాసంస్థలలో ప్రభుత్వం నిర్దేశించినంత ఫీజులే తీసుకుంటున్నారా? క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది
- 2,700 కిలోమీటర్లు నడుచుకుంటూ ఉత్తర భారతంలో తిరిగిన యువకుడు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు బయలుదేరారు
- డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications