వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌కు అండగా నాటో; తూర్పు భాగంలో 40 వేల మంది సైనికులు మోహరింపు : రష్యాకు చుక్కలే !!

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాను మరింత కట్టడి చేసేందుకు నాటో దేశాలు సిద్దమయ్యాయి. భారీగా ఆర్థిక సాయంతో పాటు ఆయుధాల సరఫరాను పెంచాలని నిర్ణయించాయి. రష్యా దాడులతో యూరప్ అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. రష్యా యుద్ధానికి ముగింపు పలికి .. శాంతి చర్చలు జరపాలని కోరాయి. రష్యా చర్యల నుంచి ఉక్రెయిన్ తనను తాను రక్షించుకోనేందుకు అవసరమైన రాజకీయ, అచరణాత్మక మద్దతు అందిస్తామని నాటో దేశాలు స్పష్టం చేశారు. రసాయన, జీవ, రేడియోలాజికల్ , అణ్వాయుధాల బెదిరింపును తిప్పికొట్టేలా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని తేల్చిచెప్పాయి.

ర‌క్ష‌ణ ప్ర‌ణాళిక యాక్టివేట్


ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో బ్రస్సెల్స్‌లో నాటో దేశాలు అత్యవసర శిఖరాగ్ర సమావేశం నిర్వహించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలపై తీవ్రంగా చర్చించారు. మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. సైబర్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడులకు ప్రతిస్పందనగా.. తాము దీర్ఘకాలిక రక్షణ ప్రణాళికలను యాక్టివేట్ చేస్తున్నట్లు తెలిపారు. తమ తూర్పు భాగాన్ని మరింత బలోపేతం చేయాలని నాటో కూటమి దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా తూర్పు భాగంలో 40 వేల మందితో కూడిన నాటో రెస్పాన్స్ ఫోర్స్ దళాలను మోహరించినట్లు తెలిపాయి.

పుతిన్ మూల్యం చెల్లించక త‌ప్ప‌దు


హంగేరీ, బల్గేరియా, స్లోవేకియాలో నాలుగు అదనపు మల్టీనేషనల్ యుద్ధ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు నాటో దేశాలు స్పష్టం చేశాయి. తమ మిత్ర దేశాల భద్రతను నిర్ధారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించాయి. అందుకు తగు చర్యలు తీసుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపాయి. అటు పాశ్చాత్య దేశాలు ఐక్యతతో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి.

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం

మరోవైపు యుద్ధ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఉక్రెయిన్‌కు మానవతా సాయాన్ని అందించాలని అమెరికా నిర్ణయించింది. ఆర్థిక తోడ్పాటు కింది ఒక బిలియన్ డాలర్లను అందించనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా లక్షమంది ఉక్రెయిన్ శరణార్థులకు దేశంలోకి అనుమతించేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అటు 320 మిలియన్ డాలర్ల నిధులతో యూరోపియన్ డెమెక్రటిక్ రెసెలియన్స్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించనున్నట్లు యూఎస్‌ వెల్లడించింది. ఈ నిధులను ఉక్రెయిన్, పొరుగు దేశాల్లో మానవ హక్కులు, మీడియా స్వేచ్చ అండగా నిలిచేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దూకుడును త‌గ్గించి త‌మ సైన్యాన్ని వెన‌క్కి పిల‌వాల‌ని కోరింది. లేద‌ని ప‌క్షంలో ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది.

English summary
US announces $ 1 billion aid to Ukraine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X