భారత్ పై ఆంక్షలకు నాటో హెచ్చరిక..! రీజన్ ఇదే..!
అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు భారత్ కు సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగినా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం జరిగినా, భారత్-పాక్ యుద్దం జరిగినా మన పాత్రపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే అంతర్జాతీయ వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని కీలక అంశాల్లో మాత్రం కొన్ని దేశాలకు టార్గెట్ కాక తప్పడం లేదు. ఇదే క్రమంలో తాజాగా భారత్ పై ఆంక్షలు విధిస్తామని అమెరికా, దాని మిత్రదేశాలతో కూడిన నాటో కూటమి హెచ్చరికలు జారీ చేసింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంత సుదీర్ఘంగా సాగడానికి కారణమైన పశ్చిమ దేశాలతో కూడిన నాటో కూటమిలో ఇప్పుడు అసహనం పెరుగుతోంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న ఈ కూటమి ఈ యుద్దంలో భారీ ఎత్తున ఆయుధాలు, డబ్బు, ఇతర సాయం అందిస్తోంది. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అంతు లేకుండా పోతోంది. ఇదే క్రమంలో రష్యాపై ఉక్రెయిన్ పైచేయి సాధించకుండా అడ్డుపడుతున్న దేశాలను నాటో టార్గెట్ చేస్తోంది.

ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొంటూ ఆ దేశానికి కీలక సాయం అందిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై ఆంక్షలు విధిస్తామని నాటో కూటమి ఇప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రష్యాతో నిరంతర వ్యాపారం చేస్తున్న ఈ మూడు దేశాలపై ద్వితీయ స్థాయి ఆంక్షలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే హెచ్చరించారు. అమెరికా కాంగ్రెస్ లో సెనేటర్లతో మాట్లాడిన ఆయన.. ఈ మూడు దేశాలకు రష్యాను ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ఒప్పించాలని సూచించారు.

రష్యాకు అండగా నిలుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ ఇప్పుడు తాము చెప్పినట్లు శాంతి ఒప్పందానికి పుతిన్ ను ఒప్పించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదని నాటో సెక్రటరీ జనరల్ హెచ్చరించారు. ఇప్పటికే నాటో కూటమిలో ప్రధానమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఉక్రెయిన్ కు భారీగా ఆయుధ సాయం చేస్తామని, అలాగే రష్యాకు సహకరించే వారిపై 100శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు నాటో చేసిన హెచ్చరికలతో రష్యాతో ఒప్పందాల్ని ఆయా దేశాలు పునరాలోచించుకుంటాయని ట్రంప్ కూడా భావిస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications