వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడిన మిస్టరీ : చంద్రడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ది సహజ మరణం కాదా..?

|
Google Oneindia TeluguNews

చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపి రికార్డు సృష్టించారు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. అయితే అతని మరణం మాత్రం కాస్త వివాదంగానే మారింది. నీల్ ‌ఆర్మ్‌స్ట్రాంగ్ గుండెపోటుకు గురికావడంతో ఎమర్జెన్సీ కింద ఓహియో నగరంలోని ఓ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు నీల్ ‌ఆర్మ్‌స్ట్రాంగ్ మృతి చెందారు. ఇది బాహ్య ప్రపంచానికి తెలిసిన నిజం. కానీ అసలు నిజం ఏమిటి..? నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎలా మరణించాడు..? ప్రముఖ అంతర్జాతీయ పత్రిక బయట పెట్టిన విషయాలు ఏమిటి..?

 నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు హార్ట్ సర్జరీ విజయవంతంగా జరిగింది

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు హార్ట్ సర్జరీ విజయవంతంగా జరిగింది

చంద్రుడిపై 1969లో తొలిసారిగా కాలు మోపిన వ్యక్తిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చరిత్ర సృష్టించాడు. ఇక 2012 ఆగష్టు 25న ఆయన తుదిశ్వాస విడిచారు. అంతకుముందు గుండెపోటు రావడంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత రెండు వారాలకు ఆయన కన్నుమూశారు. ఆసమయంలో గుండె సంబంధిత వ్యాధితో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రపంచానికి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణించాడని తెలుసు. కానీ అంతకుముందు చోటుచేసుకున్న పరిణామాలు ఎవరికీ తెలియదు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వైద్యుల తప్పిందంతోనే మరణించాడని అతని కుమారులు మార్క్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరియు ఎరిక్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ సందర్భంగా వెలుగు చూసిన అంశాలను 93 పేజీలు ఉన్న డాక్యుమెంట్‌గా తయారు చేశారు. ప్రస్తుతం అందులోని విషయాలు బయటకు వచ్చాయి. రిపోర్టులో ఉన్న అంశాలను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది.

 ఆపరేషన్ తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం

ఆపరేషన్ తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం

2012 ఆగష్టు 7న నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌కు హార్ట్ సర్జరీ జరిగింది. గుండె కాస్త వేగంగా కొట్టుకునేందుకు తాత్కాలిక వైర్లు అమర్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత వైర్లు తొలగిద్దామని వైద్యులు భావించారు. అప్పటి వరకు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బాగానే ఉన్నారు. ఒక నర్సు వైర్‌ను తొలగించడంతో శరీరంలో అంతర్గతంగా రక్తమోడింది.అంతే ఒక్కసారిగా బీపీ పడిపోయింది. ఇంటర్నల్ బ్లీడింగ్‌తో ఉన్న నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌‌ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లకుండా... ముందుగా గుండె చుట్టూ చేరిన రక్తంను క్లీన్ చేసేందుకు తీసుకెళ్లారు. ఇక్కడే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మృతి చెందినట్లు చెప్పారు విచారణాధికారులు. ఒకవేళ ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించి ఉంటే బతికేవారేమో అని చెప్పారు. వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

 పరిహారం చెల్లిస్తారా లేదా..?

పరిహారం చెల్లిస్తారా లేదా..?

ఇదిలా ఉంటే స్వతహాగా లాయర్‌ అయిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ భార్య వెండీ ఆర్మ్‌స్ట్రాంగ్ పరిహారం చెల్లించకుంటే తన ఇద్దరు కొడుకులు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎలా మరణించాడో బయట ప్రపంచానికి వెల్లడిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని హాస్పిటల్‌కు ఈమెయిల్ ద్వారా తెలిపింది. ఇదిలా ఉంటే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మృతికి తాము బాధ్యులం కాదంటూనే ఆయన కుటుంబ సభ్యులకు 6 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించింది. పేరుగాంచిన హాస్పిటల్ కావడంతో అసలుకే మోసం వస్తుందన్న భయంతో హాస్పిటల్ యాజమాన్యం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబ సభ్యులకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించిందని నివేదికలో పొందుపర్చడం జరిగింది.

 సెటిల్ మెంట్‌లో భాగంగా ఎవరెంత పంచుకున్నారు..?

సెటిల్ మెంట్‌లో భాగంగా ఎవరెంత పంచుకున్నారు..?

సెటిల్‌మెంట్‌లో భాగంగా మార్క్ మరియు ఎరిక్ ఆర్మ్‌స్ట్రాంగ్‌లకు 5.2 మిలియన్ డాలర్లు అందగా... ఆర్మ్‌స్ట్రాంగ్ సోదరుడు, సోదరికి చెరో 2,50,000 డాలర్లు, ఆరుగురు మనవళ్లుమనవరాళ్లకు 24,000 డాలర్లు పరిహారంగా అందినట్లు న్యూయార్క్‌ టైమ్స్ కథనంలో రాసుకొచ్చింది. మరోవైపు ఆర్మ్‌స్ట్రాంగ్ రెండో భార్యకు ఏమీ దక్కలేదని కూడా స్పష్టం చేసింది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టి 50 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ వార్త బయటకు రావడం విశేషం.

English summary
An Ohio hospital agreed to pay $6 million to Neil Armstrong’s surviving family members to settle allegations that medical malpractice after an emergency heart surgery caused the astronaut’s death, a report said.The New York Times first reported Tuesday about the secret settlement after the paper received an anonymous 93-page document related to Armstrong’s treatment and the legal case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X