వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ భూకంపం: షాప్ తెరిచిన వ్యక్తి, దేశాలకు దేశాలో కదిలిపోతాయా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: నేపాల్లో భూకంపం అస్తవ్యస్తం చేసింది. చారిత్రక కట్టడాలు, పలు భవంతులు నేలకూలాయి. ఎన్నో భవనాలు బీటలు వారాయి. అయితే, ఏ క్షణంలో కూలిపోతోందో తెలియని బీటలు వారిన ఓ భవనంలో ఉన్న తన కిరాణా షాపును తెరిచాడు ఓ వ్యక్తి.

బతుకు బండి నడపాలంటే ఈ షాపు ఒక్కటే జీవనాధారమని, అందుకే అపాయమని తెలిసినా షాపు తెరవాల్సి వచ్చిందని అతను చెబుతున్నాడు. ఒక పక్క భూపంకం మిగిల్చిన విషాదం, మరోవైపు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి నెలకొంది.

నక్సల్స్‌ ప్రాంతంలోని ఓ భవనం భూకంపానికి పూర్తిగా బీటలు వారింది. ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని, ఈ పరిసర ప్రాంతాలకు ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ భవనం చుట్టుప్రక్కల బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆ భవనంలో ఉన్న షాపును యజమాని తెరిచాడు. షాపు తెరవకపోతే జీవనం సాగదంటున్నాడు.

దేశాలకు దేశాలే జరిగిపోనున్నాయా?

Nepal earthquake: tensions rise over slow pace of aid

నేపాల్‌ భూకంప ప్రభావం పలు దేశాల్లో కనిపిస్లూ మరిన్ని విపరిణామాలకు పునాది వేస్తోంది. దీంతో మరిన్ని విలయాలకు సిద్ధంగా ఉండాలని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఏకంగా దేశాలకు దేశాలే జరిగిపోతున్నాయని హెచ్చరిస్తున్నారు. నేపాల్‌లో భూకంప విధ్వంసం ఒక ఎత్తైతే భూఉపరితలంలోనే ఏకంగా తేడా వచ్చేస్తోందని ఆందోళన చెందుతున్నారు.

నేపాల్‌లో పెను భూకంపంతో భారత్‌ 10 అడుగులు ఉత్తర దిశగా ముందుకు కదిలిన విషయం తెలిసిందే. నేపాల్‌ రాజధాని ఖాట్మండ్ మూడు మీటర్లు దక్షిణానికి జరిగింది.

భూమిలో మూడు భాగాల్లోని ఉపరితలం పైభాగాన మనం నివసిస్తున్నాం. మూడు భాగాలుగా ఉండే ఈ పొరలో పై భాగంలో ఉన్న రాళ్లు, మట్టి ఏర్పాటును టెక్టానిక్‌ ప్లేట్లలోని కొన్ని భాగాలు ఉంటాయి. ఇవి పక్కకు జరిగితే అక్కడ భవిష్యత్‌లో భూభాగం వచ్చేస్తుంది లేదా భూకంపం వస్తుంది.

అలా వచ్చిన ప్రస్తుత భూకంపం.. ఉత్తర భారతంలోని భూమి అడుగున ఉన్న రాళ్లు, రప్పలు, మట్టిని మరోచోటికి తరలించింది. ఈ ప్రక్రియ మన భూమిలో 15 కిలోమీటర్ల లోతువరకూ జరిగి ఉంటుందని అంచనా. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్‌ పర్వతం తొమ్మిది కిలోమీటర్ల కంటే తక్కువ.

English summary
Nepal earthquake: tensions rise over slow pace of aid
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X