కాంటాక్ట్ కోల్పోయిన నేపాల్ విమానం: ప్లేన్‌లో నలుగురు భారతీయులతోపాటు 22 మంది
ఖాట్మాండు/న్యూఢిల్లీ: 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న నేపాల్ విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు ఎయిర్‌క్రాఫ్ట్ అధికారులు తెలిపారు. ఏఎన్ఐ నివేదిక ప్రకారం.. తారా ఎయిర్ 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం 22 మంది ప్రయాణీకులతో ఆదివారం ఉదయం 9:55 గంటలకు పోఖారా నుంచి జోమ్‌సోమ్‌కు బయల్దేరింది. ఆ తర్వాత కొంతసేపటికి అధికారులతో సంబంధాలు తెగిపోయాయి.
కాగా, ఈ విమానంలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ జాతీయులు ఉన్నారు. మిగిలిన వారు నేపాలీ పౌరులు, విమానంలో సిబ్బందితో సహా 22 మంది ప్రయాణికులు ఉన్నారు.

'విమానం ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ఆకాశంలో కనిపించింది. తరువాత మౌంట్ ధౌలగిరికి మళ్లించబడింది. ఆ తర్వాత అది కాంటాక్ట్ కాలేదు' అని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ చెప్పారు.
'గల్లంతైన విమానం కోసం అన్వేషణ కోసం నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ముస్తాంగ్, పోఖారా నుంచి రెండు ప్రైవేట్ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా సెర్చ్ ఆపరేషన్ కోసం మోహరించడానికి సిద్ధం చేస్తున్నారు' అని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఫదీంద్ర మణి పోఖరేల్ వెల్లడించారు.ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications