Nepal Plane crash : ఖాట్మండు ఎయిర్ పోర్టులో కూలిన విమానం-19 మంది మృత్యువాత ?

నేపాల్ రాజధాని ఖాట్మండు ఎయిర్ పోర్టులో ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 19 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన విమానం గాల్లోకి ఎగరగానే కుప్పకూలింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న వారంతా మృత్యువాత పడి ఉంటారని భావిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక దళాలు మంటల్ని ఆర్పి బాధితుల్ని గుర్తించే పనిలో ఉన్నాయి. నేపాల్ ప్రభుత్వం ఘటనపై సహాయక చర్యలకు ఆదేశించింది.

Nepal Plane crash during take-off at Kathmandu Airport 19 feared dead

నేపాల్‌కు చెందిన శౌర్య ఎయిర్‌లైన్స్ కు చెందిన ఈ విమానం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది. పోఖారా వెళ్తున్న ఈ విమానంలో 19 మంది ఉన్నారు. ప్రమాదంలో కాలిపోయిన నలుగురి మృతదేహాలను వెలికితీసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. విమానాశ్రయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నట్లు అక్కడ తీసిన వీడియోల్లో కనిపిస్తోంది.

అయితే ప్రమాదానికి గురైన విమానం పైలట్‌ను ఆసుపత్రికి తరలించినట్లు విమానాశ్రయంలో భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. విమానం నుంచి చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపింది. ప్రమాద స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికుల పరిస్థితి వివరాలు తెలియరాలేదు.
శౌర్య ఎయిర్‌లైన్స్ కేవలం 3 విమానాలు మాత్రమే ఉన్న దేశీయ క్యారియర్. ఇవన్నీ బొంబార్డియర్ సీఆర్జే 200లే. ఒక్కో విమానం 50 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+