వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ విమాన దుర్ఘటనలో మరో కోణం-కో పైలట్ భర్త కూడా పైలటే-16 ఏళ్ల క్రితం ఇదే తరహాలో మరణం..

|
Google Oneindia TeluguNews

నిన్న నేపాల్లోని పొఖారా ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ప్రయాణికులతో పాటు పైలట్, కో పైలట్ కూడా ఉన్నారు. అయితే మహిళా కో పైలట్ అంజూ ఖతివాడా విషయంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆమె భర్త, పైలట్ అయిన దీపక్ పోఖ్రెల్ 16 ఏళ్ల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో ఇదే తరహాలో మృత్యువాత పడ్డారు.

2006లో నేపాల్లోని యతీ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ చిన్న ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో కుప్పకూలింది. ఇందులో విమానం నడుపుతున్న పైలట్ దీపక్ పోఖ్రెల్ చనిపోయారు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2010లో దీపక్ బాటలోనే పైలట్ కెరీర్ ఎంచుకున్న ఆయన భార్య అంజూ ఖతివాడా యతీ ఎయిర్ లైన్స్ లో చేరారు. అప్పటి నుంచి యతీ ఎయిర్ లైన్స్ కు పైలట్ గా పనిచేస్తున్న అంజూ నిన్న జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు.

nepal plane misap:co-pilots husband also a pilot and died in another crash 16years ago

అంతకు మించి మరో విషయం అంజూ జీవితంలో చోటు చేసుకుంది. తన భర్త దీపక్ పోఖ్రెల్ విమాన ప్రమాదంలో చనిపోవడంతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుతోనే ఆమె ట్రైనింగ్ తీసుకుని పైలట్ అయ్యారు. ఆ తర్వాత ఆమె కూడా విమాన ప్రమాదంలోనే కన్నుమూయడంతో ఆ కుటుంబంలో విషాదం మిన్నంటింది. వాస్తవానికి అంజూకు 6400 గంటలు విమానం నడిపిన చరిత్ర ఉంది. ప్రమాదం జరిగిన ఖాట్మండు-పొఖారా రూటులోనే ఆమె వేల గంటలు విమానం నడిపారు. తాజా ప్రమాదంలో మృత్యువాత పడిన పైలట్ కేసీ కమాల్ మృతదేహం దొరికినా అంజూ మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. దీంతో ఆమె చనిపోయినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.

English summary
co-pilot of nepal plane crashed yesterday anju khatiwada's husband dipak pokhrel also died in a plance crash in 2006.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X