నేపాల్ ప్రధాని రాజీనామా

Nepal: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ దేశంలో హింసాత్మక నిరసనలు, తీవ్రమవుతున్న రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లు కేపీ శర్మ ఓలీ ప్రకటించారు. ఆయన నేపాల్ నుంచే దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో సైన్యం కొత్త ప్రధాని పేరును ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం ప్రారంభమైన హింసాత్మక ప్రదర్శనల్లో 20 మందికి పైగా మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలతో ప్రభుత్వం పూర్తిగా ఇరుకున పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సైన్యాన్ని మోహరించినప్పటికీ.. Gen-Z యువతరం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు ఓలీ ప్రభుత్వాన్ని రాజీనామా చేసేలా చేశాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాజీనామాకు ముందు సైనిక దళాల అధిపతి అశోక్ రాజ్ సిగ్దెల్ ఓలీకి పదవి నుంచి తప్పుకోవాలని సలహా ఇచ్చారు. అంతకుముందే కేబినెట్‌లోని పలువురు మంత్రులు, హోం మంత్రి రమేష్ లేఖక్, ఆరోగ్య మంత్రి ప్రదీప్ పౌడెల్ వంటి వారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. దీంతో కేపీ శర్మ ఓలీ రాజకీయంగా ఒంటరి అయ్యారు.

Nepal PM KP Sharma Oli Resigns Amid Protests Parliament Set on Fire

దేశం విడిచి పారిపోయిన అనేక మంది నేతలు
నేపాల్‌లో పరిస్థితులు దారుణంగా మారడంతో అనేక మంది నేతలు దేశం విడిచి పారిపోతున్నారు. ఈ నేతలు భారత్, థాయ్ లాండ్, యూఏఈ వంటి దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారని సమాచారం. మాజీ ప్రధాన మంత్రి, నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేవూబా కూడా రహస్యంగా థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయనకు థాయ్‌లాండ్‌లో వైద్య చికిత్స అవసరం ఉన్నట్లుగా సమాచారం.

సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తం
నేపాల్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో బలగాలను పెంచారు. ఈ హింసాకాండ భారత సరిహద్దు ప్రాంతాలకు విస్తరించకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేపాల్‌లో శాంతి నెలకొల్పేందుకు భారత్ పూర్తి సహాయం అందిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.

నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు
నిరసనకారులు నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. పార్లమెంట్‌లోపల కూడా భారీగా ధ్వంసం జరిగింది. పార్లమెంట్ భవనంతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా ధ్వంసం అయినట్లు సమాచారం. ఈ చర్యతో ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆర్థికంగా కుప్పకూలిన దేశం
హింసాకాండతో పాటు, నేపాల్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభంలో ఉంది. దేశంలో సరైన ప్రభుత్వ పాలన లేకపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పర్యాటకం, వాణిజ్యం పూర్తిగా కుప్పకూలాయి. విదేశాల నుంచి పెట్టుబడులు రావడం ఆగిపోయాయి. యువత ఉద్యోగాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణాలన్నీ కలిసి హింసాకాండకు దారితీశాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+