మోడీతో భేటీకి నేను హాజరుకాను: నేతాజీ కూతురు
లండన్: ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి తాను ఉండటం లేదని స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ చెప్పారు. నేతాజీ కుటుంబ సభ్యులు సుమారు 35 మందితో అక్టోబర్ 14వ తేదీన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తాను హాజరు కావడం లేదని అనితా బోస్ చెప్పారు.
ఆమె ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. నేతాజీ కుటుంబ సభ్యులు ప్రధాని మోడీతో సమావేశమై సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి దస్త్రాలను బహిర్గతం చేయాలని, ఆయన గురించి పూర్తి సమాచారం అందించాలని డిమాండ్ చేయనున్నారు.

అయితే ఈ సమావేశానికి అనితా బోస్, ఆమె కుమారుడు సుగతో బోస్ హాజరుకావడం లేదని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆమె సన్నిహితులు చెప్పారు. అక్టోబరు 15 తర్వాతే భారత్ రానున్నారని వెల్లడించారు. నేతాజీ కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ కృష్ణబోస్ కూడా ఈ సమావేశానికి హాజరుకావడం లేదు.
వారి కుటుంబసభ్యుల్లో ఒకరైన చంద్రబోస్ మాట్లాడుతూ... తాము ప్రధాని సమావేశానికి సంబంధించి అజెండాను ఇప్పటికే ప్రధాని కార్యాలయానికి పంపించామన్నారు. నేతాజీకి సంబంధించి దస్త్రాలు కొన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద, కేంద్రం వద్ద కూడా ఉన్నాయని అన్నింటిని బహిర్గతం చేయాలని కోరనున్నట్లు చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications