Netanyahu's Coffee Shop Video: నెతన్యాహు చనిపోయాడా ? కాఫీ వీడియో కూడా..!
ఇరాన్ పై ఓవైపు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని బాంబుదాడితో హతమార్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (benjamin Netanyahu)పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఇరాన్ సంధించిన మిస్సైల్ నెతన్యాహు ఆఫీసు కమ్ ఇంటిపై పడటంతో ఆయన చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజం కాదని పలు నివేదికలు వెల్లడించాయి. చివరికి ఏఐ ప్లాట్ ఫామ్స్ కూడా దీన్ని సమర్థించాయి.
మరోవైపు తాజాగా నెతన్యాహు మాట్లాడుతున్న వీడియో ఒకటి రిలీజ్ కావడం, అందులో ఆయన ఆరు వేళ్లతో కనిపించడంతో ఏఐ వీడియో విడుదల చేశారన్న చర్చ మొదలైంది. నెతన్యాహు బయట కనిపించి చాలా రోజులు కావడం కూడా మరో కారణం. ఇప్పటికే ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ లో జరుగుతున్న నష్టం ప్రపంచానికి తెలియకుండా నెతన్యాహు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆయన నివాసంపై జరిగిన దాడిలో నెతన్యాహు బతికున్నారో లేదో కూడా ఎవరికీ తెలియడం లేదు. కానీ ఇరాన్ తాను చనిపోయినట్లు చేస్తున్న ప్రచారం ఖండించేందుకు నేరుగా తన ఎక్స్ హ్యాండిల్ లో నెతన్యాహు ఓ వీడియో పెట్టారు.

אומרים שאני מה? צפו >> pic.twitter.com/ijHPkM3ZHZ
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 15, 2026
Hey @grok is it real?
— Meena Jan (@meenajanbetani) March 15, 2026
ఇందులో నెతన్యాహు తాను బతికే ఉన్నానని, కాఫీ షాప్ లో కాఫీ తాగుతున్నట్లు కనిపించేలా ఓ వీడియో చేశారు. ఈ వీడియో విడుదల తర్వాత నెతన్యాహు బతికే ఉన్నారని అంతా నిర్ధారించుకుంటున్న సమయంలో ఎక్స్ ఏఐ ప్లాట్ ఫామ్ గ్రోక్ మరో బాంబు పేల్చింది. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నెతన్యాహు ఎక్స్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వీడియో డీప్ ఫేక్ అని తేల్చేసింది. దీంతో మరోసారి నెతన్యాహు బతికున్నారా లేదా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడిలో ఆయన సోదరుడు చనిపోవడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరుతుంది. అటు నెతన్యాహు గురించి అమెరికా కూడా మాట్లాడకపోవడంతో ఈ చర్చలు మరింత పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications