తగ్గని ఇరాన్.. సౌదీ బేస్ పై దాడి, ఐదు అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసం!
ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఎవరూ తగ్గటం లేదు. ఈ యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉద్రిక్తం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే అనేక దేశాలు ఎగుమతులు, దిగుమతులు లేక విపరీతంగా పెరిగిన ధరలతో ఆర్ధిక భారాన్ని చూస్తున్నారు.
సౌదీలోని వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
అమెరికా వాయుసేనకు ఇటీవల గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో, ఈ దాడులలో యూఎస్ వాయు దళానికి చెందిన ఐదు విమానాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఐదు కేసీ 135 రీ ఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో అమెరికా అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.

రీ ఫ్యూయలింగ్ ట్యాంకర్లు పూర్తిగా ధ్వంసం
దెబ్బతిన్న రీ ఫ్యూయలింగ్ ట్యాంకర్లు పూర్తిగా ధ్వంసం కాలేదని, వాటికి ప్రస్తుతం మరమ్మత్తులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఘటనలో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు అని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విషయం పైన స్పందించడానికి యూఎస్ సెంట్రల్ కమాండ్ నిరాకరించింది.
టెహ్రాన్ అమెరికాకు చెందిన ఎంబసీపైన క్షిపణి దాడి
అంతేకాదు ఇరాన్ వ్యూహాత్మక ద్వీపం పైన అమెరికా దాడులు చేయడంతో ప్రతిదాడులకు దిగిన టెహ్రాన్ అమెరికాకు చెందిన ఎంబసీపైన క్షిపణి దాడి చేసింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో అమెరికా ఎంబసీపై క్షిపణి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో హెలిపాడ్ ధ్వంసమైనట్టు ఇరాక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. చెందిన అతిపెద్ద దౌత్య కార్యకలాపాలలో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్ పై ఇరాన్ పదేపదే రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.
దుబాయ్ లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఒక భవనం పైన దాడి
తాజాగా జరిగిన దాడి కూడా టెహ్రాన్ పని అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన కూడా అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. మరోవైపు దుబాయ్ లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఒక భవనం పైన దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండవసారి దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, భవనం మాత్రమే దెబ్బతిందని దుబాయ్ మీడియా ఆఫీస్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications