వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ను నిర్మూలించే వ్యాక్సిన్ ఇదే: రోగ నిరోధక శక్తి ఇలా: మోడెర్నా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: బ్రిటన్‌లో సరికొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ స్ట్రెయిన్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. గుబులు పుట్టిస్తోంది. బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాల్లో దీని జాడలు కనిపించాయి. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. బ్రిటన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయుల్లో 25 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా- దక్షిణాఫ్రికాలోనూ కొత్త కరోనా వైరస్ వేరియంట్ కనిపించింది. అనేక దేశాలు ముందు జాగ్రత్తలను తీసుకుంటున్నాయి. మళ్లీ లాక్‌డౌన్ దిశగా కదులుతున్నాయి.

చైనా, రష్యాలకు అమెరికా గిఫ్ట్‌గా: కళ్లు తిరిగే బడ్జెట్: పోతూ పోతూ ట్రంప్ వీటో అస్త్రం: ఫస్ట్ టైమ్చైనా, రష్యాలకు అమెరికా గిఫ్ట్‌గా: కళ్లు తిరిగే బడ్జెట్: పోతూ పోతూ ట్రంప్ వీటో అస్త్రం: ఫస్ట్ టైమ్

ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ మాటేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి పలు ఫార్మాసూటికల్స్ కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్.. ఈ కొత్త స్ట్రెయిన్‌పై ఏ మాత్రం ప్రభావం చూపుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి తయారు చేసిన వ్యాక్సిన్లు దాని సరికొత్త రూపాంతరాన్ని ఎంత వరకు అడ్డుకోగలుగుతాయనేది ప్రస్తుతం చర్చనీయాంశమౌతోంది. మళ్లీ తమ ఫార్ములాను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం రావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

 New Coronavirus Strain: Moderna expects its COVID19 vaccine to protect Corona variant

వాటన్నింటికీ చెక్ పెట్టేలా మోడెర్నా కీలక ప్రకటన విడుదల చేసింది. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ను నిర్మూలించగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ కంపెనీ మోడెర్నా ఇదివరకే కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఆ వ్యాక్సిన్‌ను సాధారణ ప్రజల కోసం వినియోగంలోకి తీసుకుని రావడానికి అమెరికా, కెనడా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ప్రస్తుతం ఫ్రంట్ రన్నర్లుగా నిలిచాయి.

కరోనా వైరస్ కొత్తగా రూపాంతరం చెందే అవకాశం ఉందనే విషయాన్ని తాము దృష్టిలో ఉంచుకునే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సుదీర్ఘకాలం పాటు కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోందని, అది ఖచ్చితంగా తన రూపాన్ని మార్చుకుని, మరింత అభివృద్ధి చెందుతుందని అంచనా వేసినట్లు తెలిపింది. దానికి అనుగుణంగా వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు మోడెర్నా తెలిపింది. ట్రయల్స్ దశలో జంతువులు, మనుషులపై ఈ దిశగా తాము ఇదివరకే ప్రయోగాలు నిర్వహించినట్లు పేర్కొంది.

English summary
Moderna Inc said on Wednesday it expects that the immunity induced by its COVID-19 vaccine would be protective against the coronavirus variants reported in the UK. The company said it plans to run tests to confirm the vaccine's activity against any strain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X