నేపాళీలకు షాక్: అక్కడ భారత కొత్త కరెన్సీ ఇక ‘ఇల్లీగల్’
భారత్ తాజాగా విడుదల చేసిన రూ. 500, 2000 నోట్ల మార్పిడిని నిషేధిస్తూ నేపాల్ కేంద్ర బ్యాంకు తీసుకున్న నిర్ణయం నేపాలీలను సందిగ్ధంలో పడేసింది.
ఖాఠ్మాండ్: నేపాల్ కేంద్ర బ్యాంకు నిర్ణయంతో భారత కరెన్సీ మీద ఎక్కువగా ఆధారపడే నేపాలీ ప్రజలకు తాజాగా కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఓవైపు రద్దయిన 500, 1000 నోట్లను మార్చుకునేందుకు తంటాలు పడుతున్న నేపాలీ పౌరులకు అక్కడి సెంట్రల్ బ్యాంకు నిర్ణయం పులిమీద పుట్రలా మారింది.
భారత్ తాజాగా విడుదల చేసిన రూ. 500, 2000 నోట్ల మార్పిడిని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం నేపాలీలకు సందిగ్ధంలో పడేసింది. విదేశీ ద్రవ్య మార్పిడి చట్టం(ఫెమా) కింద భారత రిజర్వ్‌బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసేంతవరకు కొత్త నోట్ల మార్పిడి అనుమతించబోమని నేపాల్ రాష్ట్ర బ్యాంక్(ఎన్ఆర్బీ) స్పష్టంచేసింది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటన అనంతరం భారతదేశంలో రూ. 500, 1000 నోట్లను రద్దు చేసి.. కొత్త రూ. 500, 2000 నోట్లను రిజర్వు బ్యాంకు విడుదల చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications