ఓ బాస్ న్యూ ఇయర్ గిఫ్ట్ : 800 మంది ఉద్యోగులకు కరేబియన్ క్రూయిజ్ నౌకలో విహారయాత్ర!

కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికాకు చెందిన బెర్చ్ కేబినెట్స్ సంస్థ యజమాని కంపెనీ ఖర్చుతో సంస్థలో పని చేస్తున్న 800 మంది ఉద్యోగులకు ఐదు రోజులు కరేబియన్ సముద్రంలోని ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకపై గడిపే అవక

న్యూయార్క్: ఉద్యోగుల సంతోషమే సంస్థకు ఆయువుపట్టు పట్టు అని నమ్మిన ఓ యజమాని తన ఉద్యోగులకు కొత్త సంవత్సరం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. సంస్థకు ఏకంగా ఐదు రోజులు సెలఫు ఇవ్వడమే కాకుండా కంపెనీ ఖర్చుతో సంస్థలో పని చేస్తున్న 800 మంది ఉద్యోగులకు ఆ ఐదు రోజులూ కరేబియన్ సముద్రంలోని ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకపై గడిపే అవకాశం కల్పించారు.

అమెరికాకు చెందిన బెర్చ్ కేబినెట్స్ సంస్థ సీఈఓ తన ఉద్యోగులకు న్యూ ఇయర్ కానుకగా ఈ బహుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకులు గారీ బెర్చ్ ఆయన సతీమణి బేకీ ప్రకటించారు. 1977లో వాటర్ లూలో నెలకొల్పబడిన ఈ సంస్థ ఇళ్ళకు సంబంధించిన ఇంటీరియర్ డిజైనింగ్ సామగ్రి, కిచన్ వేర్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తుంది.

1989 నుంచి ఈ కంపెనీ ఇలా ఉద్యోగులను విహార యాత్రకు పంపించేది. అయితే 2005లో నష్టాల కారణంగా ఈ ఆనవాయితీని నిలిపివేసింది. 1000 మంది వరకు పనిచేసే బెర్చ్ కేబినెట్స్ సంస్థలో 2011లో దాదాపు 600 మంది ఉద్యోగులు మానేశారు. దీంతో మరో 240 మంది ఉద్యోగులను ఈ కంపెనీ కొత్తగా విధుల్లోకి తీసుకుంది.

New Year Gift: Boss Takes 800 employees on Caribbean Cruise!

గత ఏడాది కూడా ఈ కంపెనీకి వ్యాపారం ఆశాజనకంగా లేదు. దీంతో వ్యాపారంలో నిర్దేసిన్చుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే ఉద్యోగులను క్రూయిజ్ నౌకపై విహారయాత్రకు తీసుకెళ్తానని సంస్థ యజమాని బెర్చ్ ముందుగానే ప్రకటించారు. దీంతో ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసి కంపెనీని లాభాల బాట పట్టించారు.

దీంతో సంస్థ యజమాని బెర్చ్ తమ ఉద్యోగులకు ఈ విహారయాత్ర నజరానా ప్రకటించారు. " మేం జనవరి 9 నుంచి 13 వరకు కరేబియన్ సముద్రంలో విహరించనున్నాం.. మా ఉద్యోగుల కృషి వల్లనే ఈ ట్రిప్ సాధ్యమైంది.. హ్యాపీ హాలీడేస్.." అని గారీ బెర్చ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

జనవరి 8న తమ ఉద్యోగులందరూ 4 చార్టెడ్ ఎయిర్ క్రాఫ్ట్ లలో బయలుదేరి మియామి చేరుకుంటారని, ఆ రోజంతా అక్కడే ఓ ఫైవ్ స్టార్ హోటల్లో గడిపి మరుసటి రోజు అంటే జనవరి 9న బస్సుల్లో బయలుదేరి నౌకాశ్రయానికి చేరుకొని నౌక ఎక్కుతారని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+