వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటరి తోడేలు.. 5.5 హైట్, 180 పౌండ్ల బరువు.. మాస్క్ పెట్టుకొని మరీ అటాక్

|
Google Oneindia TeluguNews

ఓ ఆగంతకుడు జరిపిన కాల్పులతో న్యూయార్క్ ఉలిక్కిపడింది. బ్లూక్లిన్ సబ్ వే స్టేషన్ వద్ద జరిపిన కాల్పులతో ఆందోళన నెలకొంది. గాయపడిన 13 మందిని సమీపంలో గల ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఒంటరి తోడేలు దాడి చేశారని పోలీసులు తెలిపారు. అతను 5 ఫీట్ల 5 ఇంచులు ఉంటారని అంచనా వేశారు. 180 పౌండ్ల బరువు ఉంటాడని లెక్కగట్టారు.

అతను కాల్పులు జరపడానికి గల కారణం ఏంటీ అనే విషయం ఆరా తీస్తున్నారు. అతని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అతను ఆరెంజ్ బనియన్, గ్యాస్ మాస్క్ ధరించి అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పుల ఘటన ఉగ్రవాద చర్య అని పోలీసులు తెలిపారు. గాయపడిన వారంతా సేఫ్.. ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు.

New York police rules out terror attack after lone gunman injures at least 13

కాల్పులు జరిగిన తర్వాత నేల మీద రక్తంతో నిండిపోయింది. కాల్పుల తర్వాత రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దక్షిణంలో గల ఆర్ ట్రెయిన్.. 25వ సెయింట్ స్టేషన్ వద్ద దాడి చేశాడు. తలుపులు మూసి వేసి, పొగ బాంబు వేసినాక కాల్పులు జరిపాడు. ఆ తర్వాత చాలా మంది 36వ స్టేషన్ దిగి వెళ్లారు.

కాల్పుల ఘటన గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వివరించామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు. వైట్ హౌస్ సీనియర్ స్టాప్.. మేయర్ అడమ్స్‌తో టచ్‌లో ఉంటారని, పోలీస్ కమిషనర్ సెవెల్ కూడా ఉంటారని.. సాయం అవసరం అయితే కోరాలని పేర్కొన్నారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేవు.. ఇదే విషయాన్ని పోలీసులు తెలిపారు.

కాల్పుల ఘటనకు సంబంధించి అధికారులు క్లోజ్‌గా పాలొ అవుతున్నారని యూఎస్ సెక్రటరీ ఆఫ్ ట్రాన్స్‌పర్టేషన్ తెలిపారు. ఎలాంటి సాయం కావాలన్న అడగాలని కోరారు. ఎంటీఏ అండ్ ఎన్‌వై పీడీతో కలిసి పనిచేస్తున్నామని న్యూయార్క్ గవర్నర్ క్యాతీ హోచుల్ పేర్కొన్నారు.

English summary
13 people have been injured in a shootout at a subway station in Brooklyn, New York, law enforcement said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X