దారుణం: తల్లిదండ్రులే అత్యంత క్రూరంగా, చిన్నారిని బతికుండగానే పాతిపెట్టారు
న్యూఢిల్లీ: కన్న తల్లిదండ్రులే ఆ చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. పెదవి పైభాగం గ్రహణ మొర్రితో పుట్టిందని ఓ చిన్నారిని తల్లిదండ్రులే బతికుండగానే పాతి పెట్టారు. ఈ సంఘటన చైనాలోని దక్షణి ప్రావిన్స్‌లోగల గువాంగ్జీ ప్రాంతంలో జరిగింది.
చైనా మీడియా ప్రచురించిన వార్తా కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. షూ బాక్సు మాదిరి ఉండే అట్టపెట్టెలో పుట్టిన రెండు రోజులకే ఓ చిన్నారిని తల్లిదండ్రులు పాతిపెట్టారు. చుట్టూ గడ్డిమొక్కలతో పాటు ఇతర మొక్కలు అమర్చినట్లు చైనా సెంట్రల్ టెలివిజన్ చైనా ట్విట్టర్‌లో ఇమేజిలను పోస్టు చేసింది.
అట్టపెట్టెలో ఉన్న చిన్నారికి కాస్తంత గాలి అందడంతో గత ఎనిమిది రోజులుగా ప్రాణాలతో ఉన్నాడు. మూలికలను ఏరుకునేందుకు అటుగా వచ్చిన ఓ మిహళ బాలుడి ఏడుపుని విని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు బాలుడిని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు.

బాలుడి నోట్లో నుంచి మట్టిని బయటకు తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులను వారికి సహకరించిన మరో ముగ్గురు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చైనా మీడియాలో వార్తలు వచ్చాయి.
చైనాలో అంగవైకల్యం ఉన్న పిల్లలను పోషించడం అక్కడి తల్లిదండ్రులకు ఆర్ధిక పెనుభారంగా మారడంతో చాలా మంది ఇలాంటి చర్యలకే పాల్పడుతున్నట్లు అక్కడి మీడియా పేర్కోంది. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్న పిల్లల చదువులకు, మెడికల్ బిల్లులకు ఎక్కువ డబ్బు ఖర్చవడంతో తరచుగా ఇలాంటివి జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications