వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్కు గ్రహం! కొత్తగా కనుగొన్న శాస్త్రవేత్తలు, భూమికంటే పెద్దది, బరువు కూడా!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లండన్: పరిమాణంలో, బరువులో భూమికంటే కాస్త పెద్దగా.. బుధ గ్రహం లక్షణాలు.. అధికశాతం ఇనుము కలిగి ఉన్న ఓ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమికి దాదాపు 26 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కన్యారాశిలో ఉన్న ఈ గ్రహానికి కే2-229బీ అని పేరు పెట్టారు. కొందరు దీనిని ఉక్కుగ్రహంగా పిలుస్తున్నారు.

బ్రిటన్‌లోని వార్విక్ యూనివర్సిటీ, ఫ్రాన్స్‌లోని ఏఐఎక్స్-మార్సెయిల్లే యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం కే2 టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ గ్రహాన్ని కనుగొన్నారు. కే2-229బీ గ్రహం పరిమాణంలో భూమి కన్నా 20 శాతం పెద్దది. అలాగే బరువులో ఇది భూమికి రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

Newly-discovered Planet Is Hot, Metallic And Dense as Mercury

ఈ గ్రహం తన నక్షత్రానికి కేవలం 18 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతోంది. ఈ దూరం.. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో వందో వంతే. ఫలితంగా మధ్యాహ్న సమయంలో కే2-229బీ గ్రహం ఉపరితల ఉష్ణోగ్రత గరిష్ఠంగా 2,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు వరకు చేరుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అంతేకాదు, ఈ గ్రహం ప్రతి 14 గంటలకు ఒకసారి తన నక్షత్రం చుట్టూ తిరిగివస్తోందట. అయితే ఈ గ్రహం ఉపరితల లక్షణాలు మన సౌరవ్యవస్థలోని బుధ గ్రహంతో పోలి ఉన్నాయని వార్విక్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేర్కొన్నారు. కే2-229బీపై అధిక మొత్తంలో ఇనుము ఉండటంతో పరిమాణం కన్నా బరువు ఎక్కువగా ఉన్నదన్నారు.

మన సౌరవ్యవస్థలోని మొదటి గ్రహమైన బుధ గ్రహం కూడా దాని పరిమాణం కన్నా బరువు ఎక్కువగా ఉందని, సౌరవ్యవస్థలోని మిగతా గ్రహాలతో పోల్చితే బుధుడి ఆవిర్భావం కూడా భిన్నంగా సాగిందని ఆయన వివరించారు.

'కే2-229బీని చూడగానే చాలా ఆశ్చర్యపోయాం. విశ్వంలో బుధుడి లాంటి గ్రహాలు చాలా అరుదుగా ఉంటాయని ఇన్నాళ్లూ భావించాం. కానీ కే2-229బీ గ్రహం మా ఆలోచనలను మార్చింది..' అని డేవిడ్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేర్కొన్నారు.

English summary
A hot, metallic, more than Earth-sized planet with a density similar to Mercury - situated 339 million light years away -- has been detected and characterised by a global team of astronomers, including the University of Warwick. Named K2-229b, the planet is almost 20% larger than Earth but has a mass which is over two-and-a-half times greater -- and reaches a dayside temperature of over 2000°C (2330 Kelvin). It finds itself very close to its host star (0.012 AU, around a hundredth of the distance between the Earth and the Sun), which itself is a medium-sized active K dwarf in the Virgo Constellation. K2-229b orbits this star every fourteen hours.Led overall by researchers at Aix-Marseille Université in France, Dr David Armstrong and colleagues at the University of Warwick's Astronomy and Astrophysics Group independently detected the planet in the first instance, alongside researchers at the Universidade do Porto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X