న్యూస్ యాంకర్‌కు తప్పని లైంగిక వేధింపులు

మీడియా ఛానళ్లలో పని చేస్తున్న మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్, న్యూస్ డైరెక్టర్‌ల లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ న్యూస్ యాంకర్ తన ఉద్యోగం వదిలి వెళ్లిపోయింది. అయినా సరే ఆమెను మానసికంగా వేధించడంతో చివరకు జరిగిన ఉదంతాన్ని ఫేస్‌బుక్ ద్వారా బయటి ప్రపంచానికి వివరించింది.

దీంతో వారి వికృత రూపం ప్రపంచం మొత్తానికి తెలిసింది. దీంతో ఆ సదరు టీవీ ఛానల్ వారిద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. వివరాల్లోకి వెళితే షీనా షిర్నీ (32) అనే మహిళ 2007లో ఇరాన్‌లోని ప్రెస్ టీవీ అనే ఇంగ్లీషు ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పని చేసింది.

News director at Iran's Press TV caught on tape sexually harassing anchor

ఆ సమయంలో తన బాస్, న్యూస్ డైరెక్టర్ హమీద్ రాజ ఇమాదీ తనను లైంగికంగా వేధించే వాడని వాపోయింది. ముస్లిం దేశమైన ఇరాన్‌లో ఉన్న నిషేధాన్ని కూడా లెక్క చేయకుండా తనకు ఎదురైన లైంగిక వేధింపులను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది.

ఈ ఘటన తర్వాత షీనా షిర్నీ దేశాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాతే, ఈ ఆడియో క్లిప్పింగ్‌ను ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది. తన బాస్‌, న్యూస్ స్టేషన్‌లో న్యూస్ డైరెక్టర్ హమీద్‌ రజా ఇమాదీతో ఫోన్‌ సంభాషణల ఆడియో ఫైల్‌ను ఆమె ఇంటర్నెట్‌లో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

News director at Iran's Press TV caught on tape sexually harassing anchor

ఈ సంభాషణల్లో అతను తరచూ ఆమెను కోర్కె తీర్చమని అడగటం స్పష్టంగా వినిపిస్తోంది. ఆమె ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టిన ఈ ఆడియోఫైల్‌ను ఇప్పటి వరకు సుమారు 1,20,000 మంది విన్నారు. ఈ ఘటన తర్వాత ఈ ఫైల్‌ను ఆన్‌లైన్‌ నుంచి తొలగించమని హమీద్‌ పంపిన మెసేజ్‌లను కూడా ఆమె బహిర్గతం చేయడం విశేషం.

అనంతరం దీనిపై హమీద్‌ రజా ఇమాదీ మాట్లాడుతూ ఆ ఆడియో ఫైల్ కృత్రిమంగా తయారు చేసిందని ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత రావడంతో ప్రెస్ టీవీ ఛానెల్‌ యాజమాన్యం విచారణ చేయించింది. విచారణ అనంతరం షీనా షిర్నీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేసింది.

News director at Iran's Press TV caught on tape sexually harassing anchor

ఈ వ్యవహారంపై ఇరాన్ సమాచార శాఖ స్పందిస్తూ ఆ ఆడియో ఫైల్‌ పరిగణలోకి తీసుకోబోమని అదే విధంగా బాధితురాలు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+