వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్లకు గంతలు.. సెప్టీ నెట్ లేకుండా స్టంట్ (వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చికాగోలో ఓ వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకోని 587 మీటర్ల ఎత్తు ఉన్న ఒక బిల్డింగ్‌పై నుంచి మరో బిల్డింగ్‌పైకి వైరుపై నడుచుకుంటూ వెళ్లి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఈ ఈవెంట్‌కి యావత్ చికాగో సిటీ ప్రజలు సాక్ష్యాలుగా నిలిచారు.

వివరాల్లోకి వెళితే అతని పేరు డేర్‌డెవిల్ నిక్ వాల్లండా. వయసు 35 ఏళ్లు. ఈ సాహాసాన్ని ఆదివారం రాత్రిపూట దిగ్విజయంగా పూర్తి చేశాడు. చికాగో నది ఒడ్డున ఉన్న మెరినా సిటీ పడమర టవర్ నుంచి నదికి అవతలి వైపు ఉన్న మరో టవర్‌పైకి రెండు తాళ్లపై నడుచుకుంటూ వెళ్లాడు.

ఈ సాహాసాన్ని కళ్లతు గంతలు కట్టుకోని మరీ చేయడం విశేషం. మెరినా సిటీ టవర్స్ ఎత్తు 587 అడుగులు. డిస్కవరీ ఛానల్‌లో వస్తున్న అన్ని కార్యక్రమాలను కట్ చేసి మరీ డేర్‌డెవిల్ నిక్ వాల్లండా స్టంట్ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసింది డిస్కవరీ ఛానల్.

Nik Wallenda completes two tightrope walks between Chicago skyscrapers without safety net

ఏ మాత్రం కాస్తంత జారిపడినా డేర్‌డెవిల్ నిక్ వాల్లండా శరీరం ముక్కలు ముక్కులు కావాల్సిందే. అలాంటి భయంకరమైన స్టంట్‌ను అవలీలగా చేసి తన పేరు మీద ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు డేర్‌డెవిల్ నిక్ వాల్లండా. నిక్ సహాసాన్ని కళ్లారా చూసిన చికాగో ప్రజలు అద్భుతాన్ని చూశామంటూ ఆనందంలో మునిగితేలాడారు.

కళ్లకు గంతలు కట్టుకోని మరీ వైరుపై నడిచారు కదా మీ అనుభవం ఎలా ఉంది అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గాను "నన్ను మీరంతా గాలికి ఊగులాడుతున్న ఒక ఆకుని అనుకోని ఉంటారు. నేను అవతలి వైపుకి వెళ్లాలనే కృత నిశ్చయంతో ఉన్నాను. వైరుపై నడుచుకుంటూ వెళ్లాను." అని చెప్పాడు.

తరుచూ ఇలాంటి సాహసాలు చేయడం తనకలవాటే అన్న నిక్ వాల్లండా ఈసారి కొంచెం ఒత్తిడికి గురయ్యానన్నాడు. తాను 15 డిగ్రీల కోణంలో ప్రాక్టీస్ చేశానని.. ఐతే తాడు 19 డిగ్రీల కోణంలో ఉందని, దానికి తోడు గాలి బలంగా వీయడంతో కొంత ఇబ్బంది పడ్డానని పేర్కొన్నాడు.

మొత్తం రెండు వైర్లపై నడిచాడు డేర్‌డెవిల్ నిక్ వాల్లండా. తన మొదటి నడవడికలో 452 అడుగుల దూరాన్ని కేవలం 6 నిమిషాల 30 సెకన్లకి చేరుకోగా... రెండవ సారి నడిచినప్పుడు 94 అడుగుల దూరాన్ని కేవలం ఒక్క నిమిషంలో నడవడం విశేషం.

2012లో కూడా డేర్‌డెవిల్ నిక్ వాల్లండా నయగారా జలపాతంలో ఇలాంటి స్టంటే చేశాడు. అప్పడు ఈ స్టంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయగా సుమారు 13 మిలియన్ల ప్రజలు చూశారు. అమెరికాలో పేరుగాంచిన సర్కస్ కంపెనీ "డేర్ డెవిల్ సర్కస్" వ్యవస్ధాపకుడైన కార్ల్ వాల్లండా మనవడే ఈ డేర్‌డెవిల్ నిక్ వాల్లండా.

కార్ల్ వాల్లండా 1978లో ప్యూర్టో రికోలోని శాన్ జూన్‌లో సరిగ్గా ఇలాంటి స్టంట్ చేస్తుంటే ప్రమాదంలో మరణించాడు. మరణించినప్పుడు కార్ల్ వల్లండా వయసు 73 సంవత్సరాలు. ఆయన చనిపోయిన సంవత్సరానికి ర్‌డెవిల్ నిక్ వాల్లండా జన్మించాడు.

వీడియోను వీక్షించండి:

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/CYt8fn1_y74?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Daredevil Nik Wallenda broke two world records on Sunday after completing two tightrope walks between Chicago skyscrapers without a safety net or a harness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X