నిండా క్రూరత్వమే: ఫ్లోరిడా కాల్పుల నిందితుడి మైండ్ సెట్ ఇదీ..

Subscribe to Oneindia Telugu

ఫ్లోరిడా: స్కూల్ ప్రాయంలోనే అతని మనసులో క్రూరత్వం నాటుకుపోయింది. అందరు విద్యార్థుల్లా కాకుండా అతను వేరే ప్రపంచంలో విహరిస్తూ వచ్చాడు. తోటి విద్యార్థులను ఇబ్బందిపెడుతూ.. చిన్న చిన్న జీవులను హింసిస్తూ.. వికృతానందం పొందుతున్నాడు.

ఈ ప్రవర్తన నచ్చకే స్కూల్ యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసింది. దీంతో స్కూల్‌పై పగ పెంచుకున్న అతను గన్‌తో లోపలికొచ్చి 17మంది విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేశాడు. ఫ్లోరిడా కాల్పుల ఘటనలో నిందితుడికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ఉలిక్కిపడ్డ అమెరికా: ఫ్లోరిడాలో టీనేజర్ నరమేధం.. 17మంది మృతి..

సస్పెండ్ చేసినందుకే..:

సస్పెండ్ చేసినందుకే..:

ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌ ప్రాంతంలో ఉన్న మర్జోరీ స్టోన్‌మ్యాన్‌ డగ్లస్‌ హైస్కూల్‌లో నికోలస్ క్రూజ్(19) చదువుతున్నాడు. అయితే తోటి విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందిపెట్టడం.. టీచర్లను లెక్క చేయకపోవడంతో.. గతేడాది అతన్ని స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి స్కూలుపై అతను పగ పెంచుకున్నాడు.

కాల్చేస్తా అని బెదిరించేవాడు..:

కాల్చేస్తా అని బెదిరించేవాడు..:


స్కూల్లో నికోలస్ ఎప్పుడూ తమతో గొడవపడుతుండేవాడని విద్యార్థులు చెబుతున్నారు. 'మిమ్మల్ని కాల్చిపారేస్తా' అంటూ బెదిరించేవాడని, పిచ్చి పిచ్చి జోకులేసి చికాకు తెప్పించేవాడని అంటున్నారు. ఎప్పుడూ ఏదో గొడవ చేయడం అతనికి అలవాటుగా మారిపోయిందని టీచర్స్ కూడా చెబుతున్నారు.

వింత ప్రవర్తన..:

వింత ప్రవర్తన..:

స్కూల్లో అప్పుడప్పుడు తన చేతులను గోడలకు బలంగా బాది.. గట్టిగా అరిచేవాడని, వింత వింతగా ప్రవర్తించేవాడని చెబుతున్నారు. నికోసల్ వింత ప్రవర్తన కారణంగానే అతన్ని స్కూల్ నుంచి తొలగించాల్సి వచ్చిందని యాజమాన్యం చెబుతోంది. నికోలస్ సోదరి కొద్దిరోజుల క్రితమే మరణించిందని, అప్పటినుంచి అతను మరింత క్రూరంగా తయారయ్యాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

గన్స్ అంటే పిచ్చి..:

నికోలస్‌కు గన్స్ అంటే ఇష్టమని, తుపాకీ పట్టుకుని ఫోటోలు తీసుకునేవాడని చెబుతున్నారు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ను పరిశీలిస్తే.. అతనేదో మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అర్థమవుతుందని పోలీసులు అంటున్నారు. బల్లి, కప్ప లాంటి చిన్న చిన్న జీవులను అతను చిత్రహింసలు పెట్టి చంపేవాడని, వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందించేవాడని చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
he gunman who allegedly killed at least 17 people at a Florida high school on Wednesday was a former student who posted disturbing material on social media and was "crazy about guns".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి